పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్తవి కావని, సమైక్య రాష్ట్రంలోనే రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆదేశాలు వచ్చాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో శుక్రవారం సాయంత్రం ఆయన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.