ప్రజాభీష్టానికే ముఖ్యమంత్రి ఓటు | CM kcr to vote people's demand on three new districts | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 3 2016 6:57 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

‘‘కొత్త జిల్లాలపై రాష్ట్రంలో రెండు మూడుచోట్లనే ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిని సైతం జిల్లాలుగా మారిస్తే తప్పేంటీ..? జిల్లాలు చిన్నచిన్నగా అవుతాయి. అక్కడి ప్రజలు నిజంగా కోరుకుంటే ఆ దిశగా కసరత్తు చేద్దాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దీంతో కొత్తగా గద్వాల, జనగామ, సిరిసిల్ల జిల్లాల ఏర్పాటుకు సైతం సానుకూలమే అన్న సంకేతాలిచ్చారు. గద్వాలను జిల్లాగా చేయాలంటూ అక్కడి ప్రజలు, నేతలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే జనగామ, సిరిసిల్ల డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సీఎం తాజా వ్యాఖ్యలతో వీటిపై మళ్లీ ఆశలు చిగురించాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement