విజయవాడలోని సుందరయ్యనగర్‌లో పేలుడు కలకలం సృష్టించింది. కాలనీకి చెందిన పద్మారావు ఇంట్లో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. కంప్యూటర్ ఆన్ చేయడంతోటే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి ఇంట్లోని వస్తువులతో పాటు పార్కింగ్‌లో ఉన్న కారు, పక్కనున్న నాలుగు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.