దేశంలో ప్రముఖమైన దర్గాలలో ఒకటైన రాజస్థాన్ అజ్మీర్ దర్గాకు చెందిన ప్రముఖ మత గురువు సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీఖాన్ రెండు వివాదాస్పత అంశాలపై స్పందించారు. ఒకటి బీఫ్ వివాదం, రెండోది ముస్లిం మహిళల సమస్య అయిన ట్రిపుల్ తలాక్. ముస్లింలందరూ గో మాంసాన్ని(బీఫ్) తినడం మానేయాలని సూచించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. ఇతర మతస్తుల విశ్వాసాలను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముస్లింలకు మత గురువు సూచించారు.