90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. 1000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేయకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని అరుణ ప్రశ్నించారు. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్సీ సమావేశం జరిగింది. అనంతరం అరుణ మాట్లాడుతూ.. కరువు, వర్షాభావ పరిస్థితులపై చర్చించినట్టు చెప్పారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు అరుణ తెలిపారు. మంత్రులు దోచుకుంటున్నారు తప్ప రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ తమ ముద్ర ఉండాలనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలనుకుంటోందని విమర్శించారు. ఈ విషయంపై నిపుణులతో చర్చించి పార్టీ వైఖరి వెల్లడిస్తామని చెప్పారు. డీఎస్సీ సహా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో ఉన్నందువల్లే కార్మికుల వేతనాలు పెంచారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలో కార్యాచరణ చేపడుతామని అరుణ తెలిపారు.
Published Sun, Jul 26 2015 3:22 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement