చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధిని పరామర్శించేందుకు వెళ్లిన ఎండీఎంకే నేత వైకోకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి కావేరి ఆస్పత్రి దగ్గరకు వైకో కారు వెళ్లగానే అక్కడున్న డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పులు విసిరారు. డీఎంకే కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కారును ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు.