వైద్య విద్యార్థులకు శరీర ధర్మశాస్త్రం వివరించాలంటే ఇకపై శవం కోసం వేచియుండాల్సిన అవసరం లేదు. బ్లాక్ బోర్డుపై బొమ్మలు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సరికొత్త సాంకేతిక వైద్య విద్యలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలే శవాలుగా వచ్చాయి.తద్వారా అధ్యయనం చేసుకునే అవకాశం మన విద్యార్థులకూ దక్కనుంది. రాష్ట్రంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సిమ్యులేటరీ ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది. దీనికోసం ఒక్కో కళాశాలకు రూ.20 కోట్ల వ్యయం కానుంది.