రెండు గంటల తర్వాత.. అంటే ఉదయం ఏడు గంటల ప్రాంతంలో 5.6 తీవ్రతతో మరో భూకంపం కూడా వచ్చింది. 5,600 ఇళ్లలోని దాదాపు 21 వేల గదులు ధ్వంసమయ్యాయి. జాంజియాన్ రాష్ట్రంలో 1,203 గదులు కూలిపోయాయి. కేబుళ్లు తెగిపోవడంతో టెలికమ్యూనికేషన్ల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా టౌన్షిప్లపై భూకంపం ప్రభావం కనిపించింది. అనేక ఇళ్లు కూలిపోయాయి. ఇళ్లతో పాటు భారీ వృక్షాలు కూడా ఊగుతూ కనిపించాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి పోలీసులు, సైనికులతో పాటు 300 మంది స్థానిక మిలీషియా సిబ్బందిని పంపారు. చైనా రెడ్క్రాస్ సొసైటీ కూడా సహాయ సామగ్రితో సిబ్బందిని పంపింది. రైల్వే వంతెనలు, టెలికం టవర్లను త్వరగా పునరుద్ధరించడానికి యుద్ధప్రాతిపదికన పనులు మొదలయ్యాయి.