ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా నోడల్ ఆఫీసును, రాష్ట్ర వ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశారు.