యాదగిరిగుట్టకు నాలుగు లేన్ల రోడ్డు | four-lane-road-to-yadagirigutta-cm-kcr | Sakshi

Published Wed, Feb 25 2015 5:18 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే గుట్టపై గర్భాలయంలో మినహా 61/2 ఎకరాల్లో కొత్త కట్టడాలు నిర్మిస్తామని చెప్పారు. బుధవారం యాదగిరి గుట్ట సందర్శనకు వచ్చిన ఆయన అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ హామీలు ప్రకటించారు. అంతకుముందు యాదగిరి గుట్టలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు షాపులు మూయించారు. కొండపైకి వాహనాలను కూడా అనుమతించలేదు. మరోపక్క బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పోటెత్తుతుండగా పోలీసుల తీరువల్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement

పోల్

Advertisement