four lane road
-
తిరుమలలో 13 కాటేజీల పునర్నిర్మాణం
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేసే కార్మికులకు లబ్ధి కలిగించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, కమిషనర్ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి టీటీడీ చైర్మన్ భూమన మీడియాకు వివరించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కింద ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్ఎంఎస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పైగా పెంచేందుకు ఆమోదం. శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న దాదాపు 6,600 మంది ఉద్యోగులకు ఇకపై ఏటా 3 శాతం వేతనం పెంపుదల. టీటీడీలో వివిధ సొసైటీల ద్వారా పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేషన్లోకి మారిన ఉద్యోగులకు గత సేవల్ని గుర్తించి ప్రతి రెండేళ్లకు 3 శాతం ప్రోత్సాహకం ఇచ్చేందుకు నిర్ణయం. కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అకాల మరణం పొందితే రూ.2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఆమోదం. శ్రీలక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు దాదాపు 1500 మందికి హెల్త్ స్కీమ్ వర్తింప చేసేందుకు ఆమోదం. -
అబ్బురపరిచే నిర్మాణం.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే
న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేస్తూ దాని కింద ఇంజినీరింగ్ యొక్క ఘనత.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే.. అత్యాధునికమైన కళాత్మక భవిష్యత్తుకు నాంది.. అని రాశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే. నేషనల్ హైవే నెంబర్ 8 పై ఉన్న శివ మూర్తి నుండి ప్రారంభమై ఖేర్కి దౌలా వద్ద ముగిసే ఈ నాలుగు లైన్ల ప్యాకేజీ హైవే 563 కి.మీ వెడల్పుతో నిర్మితమైంది.ఈ ప్రాజెక్టు కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏకంగా 1200 చెట్లను తిరిగి నాటారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ హర్యానా మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయి. వీడియోలో చూపిన వివరాల ప్రకారం ద్వారకా నుండి మానేసర్ వరకు 15 నిముషాలు మానేసర్ నుండి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 20 నిముషాలు ద్వారకా నుండి సింఘు సరిహద్దు వరకు 25 నిముషాలు మానేసర్ నుండి సింఘు సరిహద్దు వరకు 45 నిముషాల వరకు ప్రయాణ సమయం ఉంటుందని తెలిపింది కేంద్ర రవాణా శాఖ. ఈ హైవే నిర్మాణం గనుక పూర్తయితే ద్వారకా సెక్టర్ 25లోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీని బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా మూడు లైన్ల సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల ఉక్కును వినియోగించినట్టు ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ కాగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీటు వినియోగించగా ఇది దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో వినియోగించిన దానికంటే ఆరు రేట్లు ఎక్కువ కావడం విశేషం. Marvel of Engineering: The Dwarka Expressway! A State-of-the-Art Journey into the Future 🛣#DwarkaExpressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/Qhgd77WatW — Nitin Gadkari (@nitin_gadkari) August 20, 2023 ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు.. -
నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల..
సాక్షి, సత్యసాయి జిల్లా: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల నెరవేరబోతోంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి మీదుగా కొడికొండ చెక్ పోస్టు వరకు నాలుగు లేన్ల రహదారి (ఫోర్‌లేన్)కు శ్రీకారం చుట్టారు. టెండర్ల దశకు రాగానే ఆయన మరణించారు. దీంతో ఇది మరుగున పడింది. తాజాగా ముద్దనూరు నుంచి తొండూరు, పులివెందుల, శ్రీసత్యసాయి జిల్లా కదిరి, ఓడీ చెరువు, గోరంట్ల మీదుగా కొడికొండ చెక్ పోస్టు వరకు ఇప్పుడున్న రహదారిని ఫోర్‌లేన్‌గా విస్తరింపజేసేందుకు వైఎస్సార్ తనయుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందుకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మధ్యే ఆమోదం కూడా తెలిపింది. భూ సేకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. దాదాపు 160 కి.మీ ఉన్న ఈ ఫోర్‌లేన్ పనులు రూ.2 వేల కోట్లతో మొదటి దశలో రెండు ప్యాకేజీల ద్వారా మొదలెడతారు. దీనికి స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) కూడా ఆమోద ముద్ర వేసింది. రెండో దశలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు.. గోరంట్ల నుంచి హిందూపురం వరకు నాలుగు లేన్ల రహదారిగా విస్తరింపజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రహదారిని ఇప్పటికే జాతీయ రహదారి(716జీ)గా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఫోర్‌లేన్ పనులు రెండో దశలో చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.700 కోట్లు ఖర్చు కావచ్చని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. చదవండి: అంతర్జాతీయ బ్రాండ్ కానున్న అనంతపురం ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు సైతం.. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు డబుల్‌లేన్‌గా విస్తరించనున్నారు. 32 కి.మీ మేర ఉన్న ఈ జాతీయ రహదారి– 342ని రూ.401 కోట్లతో రెండు వరుసలుగా విస్తరించేందుకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రాయచోటి నుంచి కదిరి వరకు డబుల్ లేన్.. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి వరకు 70 కి.మీ మేర ఉన్న రహదారిని డబుల్‌లైన్‌గా మార్పు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకు టెండర్ల దశ కూడా పూర్తయింది. త్వరలోనే పనులు మొదలెట్టనున్నారు. దీన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని ఇటీవల రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ప్రయాణం సులభతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఈపాటికి ముద్దనూరు – కొడికొండ రహదారి ఫోర్‌లేన్‌గా ఎప్పుడో మారేది. ఆయన తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. కానీ రోడ్డుకు మోక్షం కలగలేదు. ఇన్నేళ్లకు వైఎస్ తనయుడు జగన్ తన తండ్రి కలను సాకారం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే బెంగళూరుకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. – నాదిండ్ల రవి రాయల్, కదిరి రూపురేఖలు మారతాయి 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కదిరికి రింగ్ రోడ్ అన్నాడు. తర్వాత ఆ ఊసే లేదు. ఆయన హయాంలో చెప్పుకోవడానికి ఒక్క పథకమూ లేదు. ఒక్క అభివృద్ది పనీ లేదు. ముద్దనూరు – కొడికొండ నాలుగు లేన్ల రహదారి కోసం భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుంది. పనులు కూడా వెంటనే మొదలవుతాయి. నూతనంగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లాలో అనతి కాలంలోనే రహదారుల రూపురేఖలు మారిపోతాయి. – డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, ఎమ్మెల్యే, కదిరి -
ఏపీకి మరో గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Union Minister Nitin Gadkari: జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె– తిరుపతి ఫోర్లేన్కు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారత్‌మాల పరియోజన పథకం కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో ఎన్‌హెచ్–71లో తొలివిడతగా మదనపల్లె– పీలేరు మధ్య 55.9కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఎంపీ మిథున్‌రెడ్డి కృషి ఫలితం తిరుపతి– మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్‌రోడ్డుతో ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల ప్రజలు తిరుపతికి వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. ఈ క్రమంలో ఈ రోడ్డును ఫోర్‌లేన్‌గా మారిస్తే సౌకర్యంగా ఉంటుందని సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి వినతి పత్రం అందిస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి (ఫైల్) మాట నిలబెట్టుకునే క్రమంలో మిథున్‌రెడ్డి ఎన్‌హెచ్–71ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి మార్పించారు. అలాగే మార్గం మధ్యలో వచ్చే రైల్వే గేట్లకు సంబంధించి ఆర్ఓబీలు నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేయించారు. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని పలుమార్లు కలిసి మీడియం ప్రయారిటీలో ఉన్న ఈ ప్రాజెక్టును హై ప్రయారిటీ జోన్లో చేర్పించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి చేసిన కృషి నేడు ఫలిస్తోంది. Construction of 4-Laning of NH-71 from Madanapalle to Pileru in Chittoor district of Andhra Pradesh under Bharatmala Pariyojna has been sanctioned with budget of ₹ 1852.12 Cr. #PragatiKaHighway #GatiShakti @ysjagan @kishanreddybjp @somuveerraju @BJP4Andhra — Nitin Gadkari (@nitin_gadkari) February 22, 2022 డీబీఓటీ విధానంలో.. మదనపల్లె– చెర్లోపల్లె (తిరుపతి) జాతీయ రహదారిని మొత్తం 103 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయించారు. తొలివిడతగా మదనపల్లె– పీలేరు మధ్య 55.9 కిలోమీటర్ల నిర్మాణానికి ప్రస్తుతం రూ.1,852.12 కోట్ల బడ్జెట్ కేటాయించారు. హైబ్రీడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం) విధానంలో 40శాతం నిధులను కేంద్రప్రభుత్వం ఐదు విడతలుగా విడుదల చేయనుంది. మిగిలిన 60శాతం నిధులను డెవలపర్ వెచ్చించుకోవాల్సి ఉంటుంది. డెవలప్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఓటీ) కింద ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. -
రెండు కాదు...నాలుగు వరుసలు..
కడప–రేణిగుంట రహదారికి మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న దీనిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. విస్తరణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఐఏ)కి అప్పగించారు. రూ. 2 వేల కోట్లతో 138 కిలోమీటర్ల మేర కడప వైఎస్సార్ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట్ల విమానాశ్రయం వరకు నాలుగు వరుసల రహదారిగావిస్తరించనున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇందుకోసం ప్రత్యేక కృషి చేశారు. ఇప్పటికే ఏపీ ఎన్హెచ్ఐఏ సీజీఎం అజ్మీర్‌సింగ్ కూడా విస్తరణ చేపట్టే రహదారిని పరిశీలించారు. అన్ని సక్రమంగాపూర్తయితే నవంబరులో ఈ పనులకు టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తోంది. కడప సిటీ : కడప–రేణిగుంట రహదారి ప్రస్తుతం పది మీటర్లు కలిగి రెండు వరుసలుగా ఉంది. నాలుగు వరుసలు చేసేందుకు 20 మీటర్ల వరకు పెంచనున్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖకు ల్యాండ్ అక్విడేషన్ చేపట్టాలని ఎన్హెచ్ఐ అధికారులు విన్నవించారు. డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) కూడా సిద్ధమైంది. గతంలో ఎన్‌ఎస్‌యూలో ఉన్న ఈ రహదారిని ఎన్హెచ్ఐఏపీకి అప్పగించడంతో ఎన్‌హెచ్ 716 అనే నంబరును కేటాయించారు. కడపజిల్లాతోపాటు కర్నూలు, చిత్తూరు, ఇతర పలు రాష్ట్రాల వాహనాలు ప్రతి నిత్యం ఇదే రహదారిలో తిరుగుతుంటాయి. దీంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విస్తరణ బాధ్యతలను ఎన్‌హెచ్ నుంచి ఎన్హెచ్ఐఏ (జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ)కు అప్పగించారు. జాతీయ రహదారి–716 నంబరును కేటాయిస్తూ విస్తరణకు పూనుకున్నారు. డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. దీంతో రెండు వరుసల రహదారి నాలుగు వరుసలుగా మారనుంది. భూ సేకరణ, నిర్మాణానికి కలిపి రూ. 2000 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనాలు కూడా సిద్దం చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ రహదారి విస్తరణ అంశంపై అధికారులతో చర్చించారు.. నిధుల విషయంలో కూడా కృషి చేశారు. ప్రారంభంలో ఎన్హెచ్ఐ అధికారులు రిమ్స్‌రోడ్డు నుంచి రేణిగుంట వరకు నాలుగు లేన్ల రహదారిని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడి నుంచి అలైన్మెంట్ మార్చి వైఎస్సార్ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట విమానాశ్రయం వరకు విస్తరణ చేపట్టాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అధికారులకు సూచించడంతో చివరకు ఆయన నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. బద్వేలు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు కడప–రేణిగుంట రహదారి విస్తరణతోపాటు బద్వేలు నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు వరకు కూడా నాలుగు వరుసల రహదారిని నాణ్యతతో నిర్మించేందుకు ఎన్హెచ్ఐఏ అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. రాయలసీమ జిల్లాలతోపాటు బళ్లారి, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల నుంచి ఇనుప ఖనిజం, గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేసేందుకు కృష్ణపట్నం పోర్టు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం నుంచి కడపజిల్లా బద్వేలుకు వరకు 138 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణ చేయనున్నారు. ఇందులో కొంత భాగాన్ని ఆర్అండ్బీ, జాతీయ రహదారుల విభాగం ఆధ్వర్యంలో నాలుగు వరుసలుగా విస్తరించినప్పటికీ తాజాగా ఎన్హెచ్ఐఏ తన ప్రమాణాల మేర పూర్తి స్థాయిలో విస్తరించేందుకు సిద్ధమయ్యారు. రేపు ఢిల్లీలో సమావేశం విస్తరణకు సంబంధించి బుధవారం ఢిల్లీలో ఎన్హెచ్ఐఏ అధికారులతో ప్రత్యేక సమావేశం ఉన్నట్లు ఎన్హెచ్ఐఏ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. అక్కడ దీని గురించి వివరిస్తామని తెలిపారు. కన్సెల్టెంట్‌గా తాను కూడా వెళుతున్నట్లు తెలిపారు. త్వరలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది. -
రోడ్లన్నీ అతుకుల బొంతలే
సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : రూ.25 కోట్లతో 7 కి.మీ దూరం నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం పూర్తయి రెండు మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే పగుళ్లు ఇచ్చాయి. వాటిని కనపడకుండా పైపైన సిమెంట్‌తో మాసికలు వేస్తూ వాటిని క్యూరింగ్ చేసేందుకు గోనెపట్టలతో కప్పేశారు. ఇదీ ఒంగోలు బైపాస్ నుంచి ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపం వరకు కర్నూల్‌రోడ్డులో నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం పరిస్థితి. కర్నూల్ రోడ్డులోని నవభారత్ బిల్డింగ్స్ సమీపంలో 1/750వ కి.మీ రాయి నుంచి 8/250వ కి.మీ రాయి వరకు నిండా 7 కి.మీ కూడా లేని ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణంలో మొదటి నుంచి నాణ్యతా లోపాలు ఉన్నాయి. అంతే కాకుండా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మించే సమయంలో రోడ్డు మీదున్న ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు, ఆక్రమణలు తీయకుండా వాటిని వదిలేసి మిగిలిన ప్రాంతాల్లో రోడ్డు నిర్మించారు. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్లు, ఆక్రమణలను తాపీగా తొలగించి ఆయా ప్రదేశాల్లో ముందు వేసిన సిమెంట్ రోడ్డుకు ఆనించి సిమెంట్‌రోడ్డు వేయటం వలన జాయింట్ల వద్ద అతుకులు కలవక పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు రోడ్డు మీద పలు చోట్ల ఉండటంతో రోడ్డు ఫోర్‌లైన్ కొత్తగా వేసినట్లు లేదని, అతుకులు గతుకుల రోడ్డుగా పాత రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేసినట్లుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగానే రోడ్డు నిర్మాణంలో స్థలాభావంతో పేర్నమిట్టలో ఫోర్‌లైన్ నిర్మించలేదు. అదే విధంగా క్విస్ హైస్కూలు సమీపంలో రోడ్డు మార్జిన్లో స్థలం యజమాని కోర్టుకు వెళ్లటంతో ఫోర్‌లైన్ నిర్మాణానికి సరిపోక డబుల్‌వేతో పరిపెట్టి ఎగువన, దిగువన ఫోర్‌లైన్ నిర్మించి అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. డబుల్‌వే వద్ద మాత్రం ఫోర్‌లైన్ నుంచి నేరుగా అదే సెన్స్‌తో వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదం జరగకుండా రోడ్డు మార్జిన్లో బారికేడ్లను ఏర్పాటు చేసి డేంజర్ సిగ్నల్స్‌ను అమర్చి మీ చావు మీరు చావండన్నట్లుగా అధికారులు వదిలేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఒంగోలు నుంచి ఫోర్‌లైన్ ప్రారంభమయ్యే ప్రదేశంలో రోడ్డు మార్జిన్లకు, సైడు కాలువలకు కూడా స్థలం లేకపోవడంతో ఇళ్లను ఆనించి మరీ ఫోర్‌లైన్ నిర్మించారు. రేపు వర్షాకాలంలో వచ్చే వరద నీరు ఎటుపోవాలోనని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్డు నిర్మాణంలో డివైడర్ల ఏర్పాటులో వాస్తవానికి స్థానికంగా దొరికే మట్టితో నింపాలి. మున్సిపల్ కార్పొరేషన్ వారు మంచి మట్టి పోసి చెట్లు పెంచుతామన్నారని చెప్పినట్లుగా సాకుతో డివైడర్ల మధ్య మట్టిపోయకుండా దాదాపు ఏడాదికి పైగా రోడ్డు నిర్మాణం పూర్తయినా అలాగే ఖాళీగా ఉంచారు. ఇలా రూ.25 కోట్లతో నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణంలోని అవకతవకలను ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణా లోపం, ప్రభుత్వ ఒత్తిడిల కారణంగానే రోడ్డు నిర్మాణం లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు స్థానిక ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. -
యాదగిరిగుట్టకు నాలుగు లేన్ల రోడ్డు
-
యాదగిరిగుట్టకు నాలుగు లేన్ల రోడ్డు
రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే గుట్టపై గర్భాలయంలో మినహా 61/2 ఎకరాల్లో కొత్త కట్టడాలు నిర్మిస్తామని చెప్పారు. బుధవారం యాదగిరి గుట్ట సందర్శనకు వచ్చిన ఆయన అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ హామీలు ప్రకటించారు. అంతకుముందు యాదగిరి గుట్టలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు షాపులు మూయించారు. కొండపైకి వాహనాలను కూడా అనుమతించలేదు. మరోపక్క బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పోటెత్తుతుండగా పోలీసుల తీరువల్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.