రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే గుట్టపై గర్భాలయంలో మినహా 61/2 ఎకరాల్లో కొత్త కట్టడాలు నిర్మిస్తామని చెప్పారు. బుధవారం యాదగిరి గుట్ట సందర్శనకు వచ్చిన ఆయన అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ హామీలు ప్రకటించారు. అంతకుముందు యాదగిరి గుట్టలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు షాపులు మూయించారు. కొండపైకి వాహనాలను కూడా అనుమతించలేదు. మరోపక్క బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పోటెత్తుతుండగా పోలీసుల తీరువల్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.