ప్రియుడి పెళ్లిని అడ్డుకునేందుకు ప్రియురాలు ప్రయత్నించిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలం నాగవరప్పాడులో శుక్రవారం చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరో యుతితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ లిల్లీ పుష్పం అనే యువతి తన ప్రియుడి ఇంటివద్ద ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో వరుడు తనను మోసం చేశాడని దుమ్మెత్తి పోసింది.