Krsihna District
-
‘వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబు’
గుడివాడ: చంద్రబాబు, ఎల్లో మీడియాపై మరోసారి ధ్వజమెత్తారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు అండ్ కంపెనీ ఇష్టంమొచ్చినట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంపై కొడాలి నాని తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే... చెప్పేవాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ‘ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్‌లను ఏడు విడతల్లో జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీలో సీట్ల మార్పులు జగన్మోహన్రెడ్డి చేస్తారు.. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు, మహాటీవీ వంశీ కాదు. నరేంద్రమోదీకి కూడా గుడివాడలో ఏబీఎన్ రాధాకృష్ణ టికెట్ ఇవ్వగలడు. నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనండి. గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్మోహన్రెడ్డి చెబుతారు.. టీవీ5, ఏబీఎన్, మహాన్యూస్పకోడీగాళ్లు కాదు. ఏబీఎన్ రాధాకష్ణ,బీఆర్ నాయుడు పోటీచేస్తారని నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా ... నిజమైపోతుందా? ... గన్నవరంలో వంశీని, గుడివాడలో నన్ను మారుస్తామని జగన్మోహన్రెడ్డి చెప్పారా?, మా సీట్లు ఇవ్వడానికి ఈ ఏబీఎన్..టివి5,మహాటీవీ బఫూన్ గాళ్లు ఎవరు?, పక్కలేస్తే సీట్లివ్వడం...డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్సీపీలో ఉండదు. వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు. మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు. వైఎస్సార్సీపీలో ఒకడు ట్రైచేస్తేనో... బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు. సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు.చంద్రబాబుకు దమ్ముంటే..మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి. సీట్లు మారుస్తాడా లేదా.. అనేది మాకు జగన్మోహన్రెడ్డికి సంబంధించిన వ్యవహారం. మధ్యలో టీడీపీ బ్రోకర్లకు పనేంటి. .... ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోమనండి. జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి. ఎంతమంది కలిసొచ్చినా జగన్మోహన్రెడ్డిని ఎదిరించలేరు. జగన్ సింగిల్‌గా వస్తానని చెబుతున్నాడు. మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు. చంద్రబాబు పర్మినెంట్‌గా మాజీగానే ఉంటాడు. పదిలక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి. ఏబీఎన్‌ను, వాళ్ల పేపర్ ను మేం బ్యాన్ చేశాం.. ఎవరు రమ్మన్నారు. రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ,బీఆర్ నాయుడు మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు విరిచేస్తారు’ అని కొడాలి నాని విమర్శించారు. -
భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ అయ్యేందుకు వీలులేక బెంగుళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. బెంగుళూరు నుంచి సుమారు 50మంది ప్రయాణికులతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం సుమారు అరగంట పాటు 8 సార్లు చక్కర్లు కొట్టింది. అనంతరం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి వచ్చిన మరో ఇండిగో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొట్టాయి. దాదాపు 10 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో పాట్నాకి దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారలు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు! -
పాఠశాల భవనాన్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలంలో తేలప్రోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి ప్రారంభించారు. వనరత్నాల పథకంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన ప్రవాస భారతీయుడు, పూర్వ విద్యార్థి భీమవరపు సోమశేఖర్ రెడ్డి రూ. కోటీతో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు. అదే విధంగా పాఠశాల ఫర్నీచర్‌కు పది లక్షలు విరాళం అందించారు. ఈ స్కూల్ భవనం నాడు-నేడు కార్యక్రమంలో పూర్తి అయింది. పాఠశాల భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిలుగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని భాలశౌరి పాల్గొన్నారు. -
నారాయణలో విద్యార్థి అనుమానాస్పద మృతి
-
నారాయణలో విద్యార్థి అనుమానాస్పద మృతి
సాక్షి, విజయవాడ : గూడవల్లిలోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. కాలేజ్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది. విద్యార్థి మృతిపై వివరాలు వెల్లడించేందుకు కాలేజ్ సిబ్బంది నిరాకరిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థి మృతిపై పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. iframe border="0" width="100%" height="380" src="https://www.sakshi.com/sites/default/files/video/embed/2019/07/02/1203235.html" frameborder="0" scrolling="no" > -
ఆస్తి తగాదాలో నిండు ప్రాణం బలి
విజయవాడ: ఆస్తి తగాదాలో ఓ తండ్రి నిండు ప్రాణం బలి అయింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో జరిగింది. గోప్యానాయక్, మంగ్యానాయక్లు తండ్రీకొడుకులు. వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి తగాదా మరింత ముదిరింది. ఆగ్రహంతో రగిలిపోయిన మంగ్యానాయక్ తన తండ్రి గోప్యానాయక్‌ను గొడ్డలితో నరకడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. -
ప్రియుడి పెళ్లిలో ప్రియురాలి గలాభా
-
ప్రియుడి పెళ్లిలో ప్రియురాలి గలాభా
గుడివాడ: ప్రియుడి పెళ్లిని అడ్డుకునేందుకు ప్రియురాలు ప్రయత్నించిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలం నాగవరప్పాడులో శుక్రవారం చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరో యుతితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ లిల్లీ పుష్పం అనే యువతి తన ప్రియుడి ఇంటివద్ద ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో వరుడు తనను మోసం చేశాడని దుమ్మెత్తి పోసింది. తనకు న్యాయం చేయాలని కోరినా పట్టించుకునేవారు లేకపోవడంతో పెళ్లి పందిట్లో సామాన్లు విసిరేసి నిరసన తెలిపింది. వరుడు కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకుని అక్కడి నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు స్పృహ తప్పి పడిపోయింది. వరుడి బండారం బట్టబయలు కావడంతో స్థానికులు అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.