సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే తప్ప పారిపోయే వ్యక్తిని కాదని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎందాకైనా పోరాడతానని, మడమ తిప్పబోనని చెప్పారు. గురువారం సాయంత్రం అనంతపురంలో ప్రత్యేక హోదాపై నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ మాట్లాడారు. అంతకంటే ముందు వీర జవానులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కాకినాడ సభ తర్వాత అనంతపురం రెండు వారాల కిందటే రావాల్సి ఉందని, సరిహద్దులో భారత జవాన్లు వీర మరణం పొందిన సమయంలో ప్రత్యేక హోదాపై మాట్లాడటం సరికాదని అనిపించిందని అందుకే ఆలస్యంగా సభ పెట్టాల్సి వచ్చిందని అన్నారు.
Published Thu, Nov 10 2016 4:46 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
Advertisement