ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటేందుకు విశాఖపట్నంలో గురువారం సాయంత్రం నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలో యువత పాల్గొనకుండా చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని, తనను అరెస్టు చేస్తారా.. ఏం చేస్తారో మీ ఇష్లం అని వ్యాఖ్యానించారు. శాంతియుతంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తున్నామని, దీనికి ఆటంకాలు కలిగించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.