Candle Light Rally
-
కొనసాగిన నిరసనలు
సాక్షి, నెట్వర్క్: తెనాలికి చెందిన గొల్తి గీతాంజలిని అసభ్యకర మెసేజ్‌లతో వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ, జనసేన పార్టీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలిపై ఈ రెండు పార్టీల సోషల్ మీడియా మూకలు అసభ్య సందేశాలతో దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రజలు చేస్తున్న నిరసనలు గురువారమూ కొనసాగాయి. పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. ట్రోలింగ్ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలో న్యాయవాదులు గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ న్యాయస్థానాల సముదాయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్వో వి.శ్రీనివాసరావుకు న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ టీడీపీ చర్యలతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుజాత, ఉషాజ్యోతి, సౌమ్య, జ్యోతి, సి.హెచ్.సాయిరామ్, పిళ్లా రవి, కె.జయరాజు, మన్మధరావు, కె.ప్రభాకర్, నిర్మల్ రాజేష్ , సూర్యనారాయణరెడ్డి, పూర్ణ, భార్గవ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద గీతాంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులరి్పంచి, గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గొర్రుపోటు రమాదేవి తదితరుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేశారు. -
చంద్రబాబు తీరు సిగ్గుచేటు
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, ఆయన తీరు సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. ఆయన స్వలాభం కోసం దేన్నైనా నాశనం చేస్తారని దుయ్యబట్టారు. మూడు రాజధానులను అడ్డుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలు కలెక్టరేట్ వద్దనున్న గాంధీజీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీవై రామయ్యతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మూడు రాజధానులను ప్రకటించారన్నారు. భవిష్యత్‌లో ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా ఉండాలంటే మూడు రాజధానులే పరిష్కారమన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసిన సీఎంకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానులను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు పన్నడం శోచనీయమన్నారు. స్వలాభం కోసం అమరావతి రాజధానిగా ఉండాలని పట్టుబట్టడం దారుణమన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణను అడ్డుకోవడానికి చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఆయన ఎన్ని కుట్రలు పన్నినా త్వరలోనే మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయితే ఇక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నాయకులు సీహెచ్ మద్దయ్య, రైల్వే ప్రసాద్, ఆదిమోహన్‌రెడ్డి, జమీల, రియల్ టైం నాగరాజు యాదవ్, సాంబశివారెడ్డి,దేవపూజ ధనుంజయాచారి, డీకే రాజశేఖర్, మంగమ్మ, రాజు,కృష్ణకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా
-
ఏపీలో మహిళలపై దాడులకు నిరసనగా..
సాక్షి, హైదరాబాద్ : మహిళలు, బాలికలపై దాడులకు నిరసనగా శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నట్టు ఆ పార్టీ సీనియర్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 13 జిల్లాల్లో రేపు సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ చేపడతామని వివరించారు. ఈ నెల 14న వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఏలూరు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 2,000 కిలోమీటర్ల మైలురాయిని దాటుతుందని చెప్పారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ఈ నెల 14, 15 తేదీల్లో నల్లజెండాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు పాదయాత్రలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 16న కలెక్టరేట్ల వద్ద వంచనపై గర్జన పేరుతో ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ధర్నాల అనంతరం సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. బీజేపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడంలో చంద్రబాబు ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నాలుగేళ్ల చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవని అన్నారు. పరిశ్రమల పేరిట లక్షలమందికి ఉద్యోగాలు వస్తున్నాయంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తాండవం అడుతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అన్ని వ్యవస్థలనూ సీఎం చంద్రబాబు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు. -
వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాల అడ్డగింత!
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఆందోళన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం వైజాగ్‌కు వస్తుండటంతో పోలీసులు ఓవరాక్షన్‌కు తెరతీశారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో భారీగా బందోబస్తును మోహరించారు. ఎయిర్‌పోర్టులో డీజీపీ సాంబశివరావు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వైజాగ్ బీచ్‌రోడ్డులో జరిగే మహా కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్ జగన్ పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఆర్కే బీచ్‌లో సాయంత్రం ఆరు గంటలకు ఈ ర్యాలీ మొదలవుతుంది. ఆర్కే బీచ్ నుంచి పార్కు హోటల్ వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుంది. అయితే, ఈ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ర్యాలీ నిర్వహించే ప్రాంతంలో పోలీసులు అడుగడుగునా మోహరించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వైజాగ్‌లో ప్రత్యేక హోదా ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతియుత పోరాటానికి సిద్ధమైన యువతను పోలీసులు, ప్రత్యేక బలగాలు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. -
చంద్రబాబూ.. రా కలసి పోరాడదాం
-
విశాఖ ర్యాలీలో నేను పాల్గొంటాను: వైఎస్ జగన్
హైదరాబాద్: ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటేందుకు విశాఖపట్నంలో గురువారం సాయంత్రం నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలో యువత పాల్గొనకుండా చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని, తనను అరెస్టు చేస్తారా.. ఏం చేస్తారో మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు. శాంతియుతంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తున్నామని, దీనికి ఆటంకాలు కలిగించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు యువత ముందుకొస్తుండగా.. ర్యాలీ జరపొద్దంటూ చంద్రబాబు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోయినా సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉందని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడం దారుణమని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదా కోసం పిలుపునిచ్చిన బంద్‌ల సమయంలోనూ ఉద్యమాన్ని చంద్రబాబు నీరుగార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలన చూస్తుంటే.. బ్రిటిష్ పాలనలో ఉన్నట్టుందని విమర్శించారు. యువభేరి సదస్సులకొచ్చే విద్యార్థులపై పీడీ కేసులు పెడుతున్నారని, విద్యార్థులపై కాదు చంద్రబాబుపై టాడా కేసుపెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. జూన్ వరకు వేచిచూస్తాం.. ఆ తర్వాత రాజీనామాలే! ప్రత్యేక హోదా కోసం ఎవరూ ముందుకొచ్చినా స్వాగతిస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అందరం కలిసి ఢిల్లీ వెళ్దామని, చంద్రబాబు కూడా ముందుకురావాలని కోరారు. అయినా హోదాకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే.. మొత్తం 25 మంది కేంద్రం నుంచి మీ మంత్రులను ఉపసంహరించుకోవాలని, మొత్తం 25 మంది ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దామని సూచించారు. ఈ ఉద్యమంలో చంద్రబాబు సహకరించినా, సహకరించకపోయినా తాము ముందుకే వెళుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాలకు మూడేళ్ల వరకు సమయమిస్తానని, జూన్ వరకు వేచిచూస్తామని తెలిపారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని ఆయన వెల్లడించారు. ఎంపీలంతా రాజీనామా చేసి దేశంమొత్తం చూసేలా ఉప ఎన్నికలకు వెళుతారని, రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీని ప్రభుత్వాలు నిలబెట్టుకోలేని విషయాన్ని దేశానికి చాటిచెప్తారని ఆయన చెప్పారు. ఈ ఉద్యమంలో చంద్రబాబు కూడా మాతో కలిసి వస్తే సంతోషిస్తామని, ఆయన కలిసిరాకపోతే ప్రజలు, దేవుడు ఆయనను కచ్చితంగా బంగాళాఖాతంలో కలుపుతారని పేర్కొన్నారు. జల్లికట్టు విషయంలో తమిళనాడు అంతా ఏకమైందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ముందుండి డిమాండ్‌ను సాధించారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం చంద్రబాబు అలాంటి పనిచేయకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. -
హోదా కోసం ఎందాకైనా పోరాటం !
-
హోదాతోనే మంచి రోజులు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధిం చేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారని తెలిపారు. రెండున్నరేళ్లుగా ఈ నినాదాన్ని తమ పార్టీ మోగిస్తోందని, ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ఊపిరి పోస్తోందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి ప్యాకేజీకి ఓకే చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారు. ప్యాకేజీతో ఆ పార్టీ నాయకుల జేబులు నిండుతాయే తప్ప పేదల కడుపులు నిండవని తెలిపారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగానే ఈనెల 26వ తేదీన సాయంత్రం 5.30గంటలకు శ్రీకాకుళంలోని సూర్యమహల్ కూడలి వద్ద నుంచి జీటీ రోడ్ మీదుగా వైఎస్సార్ కూడలి వరకూ ర్యాలీగా నిర్వహించి అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తామన్నారు. నిర్వాసితులపై నిర్లక్ష్యమేల? వంశధార నిర్వాసితులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏ మాత్రం బాగా లేదని ఆమె అన్నారు. హామీలతో కాలం నెట్టుకువస్తున్న నేతలు సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదని సూటిగా విమర్శించారు. ప్రజా పోరాటాన్ని అణగదొక్కాలని చూస్తే కలమట, అచ్చెన్నలకు అక్కడి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వంశధార నిర్వాసితుల విషయంలో ప్రజాప్రతినిధులు చేసిన తప్పులను అధికారులపైకి నెట్టివేయడం చంద్రబాబుకు తగదన్నారు. నిర్వాసితుల అభిమానం దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ నేత మెంటాడ వెంకట స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ దీక్షకి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ
-
ఉదయ్ ఆత్మశాంతికై క్యాండిల్ లైట్ ర్యాలీ
-
ఢిల్లీలో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
-
రాష్ట్ర విభజనకు నిరసనగాకొవ్వొత్తుల ర్యాలీ