ప్రజలను భయపెట్టి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనైతిక, నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి మండిపడ్డారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ పనుల యథాతథంగా కొనసాగించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జలసాధన యాత్ర పేరిట కామారెడ్డిలోని భూంపల్లి చెరువు నుంచి పద్మాజీవాడీ వరకు నిర్వహించిన పాదయాత్ర, అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘నాడు హోంమంత్రిగా ఉన్న నేను అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను చర్చలకు పిలిచాను.