Regime
-
ఆంధ్రప్రదేశ్‌లో ముఠాల పాలన... రాష్ట్రం రాజకీయ హింసకు మారుపేరుగా మారింది...
-
ఎన్టీఆర్ మించి సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేసీఆర్
-
భారత్–మయన్మార్ సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారం బంద్
న్యూఢిల్లీ: భారత్–మయన్మార్ మధ్య ఫ్రీం మూమెంట్ రెజీమ్(ఎంఎంఆర్)ను రద్దు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశ అంతర్గత భద్రత, ఈశాన్య రాష్ట్రాల జనాభా నిర్మాణ పరిరక్షణ కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎఫ్‌ఎంఆర్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ హోం శాఖ అందజేసిన ప్రతిపాదనపై అంతర్గత వ్యవహారాల విభాగం చర్యలు తీసుకుంటోందని అమిత్ షా చెప్పారు. ఎఫ్ఎంఆర్ ఫలితంగా రెండు దేశాల సరిహద్దుల్లోని 16 కిలోమీటర్ల భూభాగంలో ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా సంచరించే వెసులుబాటు ఉంది. భారత్–మయన్మార్లు సుమారు 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాయి. యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా 2018 నుంచి తీసుకువచ్చిన ఎఫ్ఎంఆర్ విధానం ప్రస్తుతం మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో అమల్లో ఉంది. సరిహద్దుల్లో కంచె నిర్మించాలంటూ ఇంఫాల్ లోయలో ఉండే మైతీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌ఎంఆర్‌ను అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారని, డ్రగ్స్ వ్యాపారం సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. -
చంద్రబాబు పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు: మంత్రి మేరుగ నాగార్జున
-
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భారీ స్కామ్.. నోటీసులు జారీచేసిన ఈడీ
-
గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణంపై ఈడీ నోటీసులు
-
బిగ్ క్వశ్చన్ : బాబు బతుకంతా అబద్దాలే..
-
చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
-
చంద్రబాబు అప్పుడెందుకు స్పందించలేదు
రంపచోడవరం: టీడీపీ హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగితే స్పందించని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారని, అప్పుడు లేవని గొంతు ఇప్పుడేందుకు లేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ధ్వజమెత్తారు. రంపచోడవరంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడారు. విజయవాడలో మానసిన వికలాంగురాలుపై జరిగిన దాడిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందన్నారు. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం అందజేయడమే కాకుండా ఆ కుటుంబంలో వారికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించిందన్నారు. ఈ యాప్ ఉంటే ప్రతి మహిళకు ఒక సెక్యూరిటీ గార్డు వెంట ఉన్నట్టే అన్నారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలు ఎందుకు ఆ సంఘటనను ఖండించలేదని ప్రశ్నించారు. ప్రతి దానిని రాజకీయం చేయడం తగదన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తి వేధింపులకు బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబునాయుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. కాల్‌మనీ కేసులో కుటుంబాలను రోడ్డుపై లాగారని విమర్శించారు. వీటిపై ప్రశ్నించిన మంత్రి రోజాను అప్పుడు ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. విజయవాడ సమావేశాలకు పిలిచి పోలీస్ వ్యాన్‌లో రోజాను తిప్పిన సంఘటనను చంద్రబాబు గుర్తుతెచ్చుకోవాలన్నారు. ముంపు గ్రామాలను నూరుశాతం తరలింపు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో నిర్వాసితులను బయటకు తరలించామని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. ఒకటి రెండు గ్రామాలకు పునరావాస కాలనీ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అప్పటి టీడీపీ పర్సంటేజీల కోసం కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి నిర్వాసితుల గురించి పట్టించుకోలేదన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు నిర్వాసితుల తరఫున మాట్లాడుతున్నరని నిలదీశారు. వైఎస్సార్ సీపీలో గెలుపొంది టీడీపీకి అమ్ముడు పోయిన వంతల రాజేశ్వరి నిర్వాసితుల కోసం ఏం చేయలేదన్నారు. ఇప్పుడు న్యాయపోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిర్వాసితుల కోసం రాజేశ్వరి ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి కాలనీలకు తరలించినట్లు తెలిపారు. పోలవరం నిర్వాసితులు అందరికీ న్యాయం చేస్తామన్నారు. పోలరవం ప్రాజెక్టు కోసం వారి జీవితాలను త్యాగం చేశారని, పుట్టి పెరిగిన గ్రామాలను జ్ఞాపకాలను వదిలి వెళ్లిన వారికి ఎంత చేసిన తక్కువేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారన్నారు. నిర్వాసితుల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా వారికి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (చదవండి: ప్రోత్సహిస్తే సిరులే!) -
జగనన్న పాలనపై వ్యాసాలకు ఆహ్వానం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాహసోపేత నిర్ణయాలతో జరుగుతున్న జన రంజక పాలనపై వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వాహనమిత్ర, వసతి దీవెన, విద్యా దీవెన... ఇలా ప్రభుత్వ పనితీరులో చోటుచేసు కున్న మార్పులను విశ్లేషించాలి. చదవండి: ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్రలు మీ వ్యాసం సరళమైన తెలుగులో, 500–800 పదాల మధ్య ఉండాలి. వాట్సప్‌లో లేదా పేజ్ మేకర్ 7.0 లేదా యూనికోడ్లో టైపు చేసిన ఓపెన్ డాక్యుమెంట్లు మాత్రమే పంపించాలి. బహుమతులకు ఎంపికైన 20 వ్యాసాలే కాక మంచి విశ్లేషణ గల మరో 20 వ్యాసాలను కలిపి పుస్తకంగా ప్రచురిస్తాం. మొదటి (రూ.10 వేలు), రెండు (రూ.5 వేలు), మూడు (రూ.3 వేలు), నాలుగు (రూ.2 వేలు), ఐదు (రూ.1000) బహుమతులతోపాటు ప్రచురించిన ప్రతి వ్యాసానికీ రూ. 1000 ఇస్తాం. బహుమతి ప్రదానం పుస్తకావిష్కరణ రోజే ఉంటుంది. వ్యాసాలు పంపడానికి ఆఖరు తేదీ: 2022 ఏప్రిల్ 30. పంపాల్సిన వాట్సాప్ నంబర్: 9393111740. ఈ–మెయిల్: srdalitsocialmedia@gmail.com – డా.జి.కె.డి.ప్రసాద్, వైఎస్ఆర్ దళిత్ సోషల్ మీడియా, విశాఖపట్నం -
నాడు రాళ్లు.. నేడు పూలు.. ప్రజల్లో మొదలైన చర్చ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. సరిగ్గా మూడున్నరేళ్ల కిందట జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో 2018 మే 11న తిరుమలకు విచ్చేశారు. ఆయన కుటుంబంతో సహా స్వామి వారి దర్శనం చేసుకుని తిరుపతికి వస్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద టీడీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. అయితే భద్రతా సిబ్బంది అమిత్ షా ప్రయాణిస్తున్న కారును వేగంగా ముందుకు కదిలించడంతో, రెచ్చిపోయిన టీడీపీ మూకలు కాన్వాయ్‌లోని ఓ కారు అద్దాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించాయి. చదవండి: కుప్పానికి టీడీపీ దొంగ ఓటర్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ సాకుతో అమిత్ షా పర్యటనలో టీడీపీ మూకలు చెలరేగిపోయి. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబే దాడికి ఉసిగొల్పారని, ఆయన ఆదేశాల మేరకే టీడీపీ శ్రేణులు అమిత్‌షా కాన్వాయ్‌పై తెగబడ్డాయని బీజేపీ నేతలు ఆరోపించారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసి సీఎం అయిన చంద్రబాబు అదే బీజేపీ జాతీయ అధ్యక్షుడుని అవవనించారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆ వాదనలకు తగ్గట్టుగానే అమిత్‌షా కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన వారిపై నామమాత్రపు కేసులు పెట్టిన టీడీపీ సర్కారు నిందితులను పూర్తిగా పక్కకు తప్పించేసింది. పైగా ఆ ఘటనలో పాల్గొన్న, సారథ్యం వహించిన కార్యకర్తలకు ఆ తర్వాత పార్టీలో పదోన్నతులు, కార్పొరేటర్ టికెట్లు బహుమానంగా అందించింది. దగ్గరుండి తిరుమల దర్శనానికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి తిరుపతి వేదికగా ఆదివారం జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు అమిత్ షా శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేశారు. అమరావతి నుంచి ముందుగానే అక్కడికి వివనంలో చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమిత్‌షాకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఆయనతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. దగ్గరుండి శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. అనంతరం అమిత్ షా నగరంలో బస చేసిన తాజ్ హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత సీఎం రాత్రి 12 గంటల సమయంలో అమరావతికి బయలుదేరారు. బీజేపీతో ఎలాంటి పొత్తు లేకపోయినా, సైద్ధాంతిక పరమైన విభేదాలు ఉన్నా.. రాష్ట్ర వాటాల కోసం కేంద్రంతో పోరాడుతున్నా.. ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ.. రాష్ట్రానికి వచ్చిన అతిథిగా అమిత్ షాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత గౌరవ మర్యాదలను అందించారు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. నాడు బాబు జమానాలో తిరుపతిలో అమిత్ షాకు జరిగిన అవమానం.. నేడు వైఎస్ జగన్ హయాంలో అదే తిరుపతిలో లభించిన గౌరవం.. పోల్చి చస్తున్న పరిశీలకులు రాజకీయాల్లోనూ, నైతిక విలువల్లోనూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకి.. మహానేత తనయుడు జగన్‌కి ఉన్న తేడా ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎగవేతదారులను వదలొద్దు
న్యూఢిల్లీ: వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకుని పన్నులను ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అయితే, నిజాయతీగా కట్టాలనుకునేవారికి అవసరమైన తోడ్పాటునిచ్చి, తగిన విధంగా గౌరవించాలని పేర్కొన్నారు. 159వ ఆదాయపు పన్ను దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ఎగవేతదారులను పట్టుకునేందుకు రెవెన్యూ శాఖలోని మూడు కీలక విభాగాలు (ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ‘తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకునేందుకు మీ దగ్గర డేటా మైనింగ్, బిగ్ డేటా విశ్లేషణ వంటి సాధనాలు ఉన్నాయి. ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించండి. అలాంటి విషయాల్లో మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపన్నులపై అధిక పన్ను భారం అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్నులు చెల్లించడాన్ని ప్రజలు జాతి నిర్మాణంలో తమ వంతు కర్తవ్యంగా భావించాలే తప్ప జరిమానాగా అనుకోరాదని మంత్రి చెప్పారు. ‘ఎక్కువ సంపాదిస్తున్న వారిని శిక్షించాలన్నది మా ఉద్దేశం కాదు. ఆదాయాలు, వనరులను మరింత మెరుగ్గా పంచడానికి ఈ పన్నులు అవసరం. అత్యధికంగా ఆదాయాలు ఆర్జించే వర్గాలు కొంత మేర సామాన్యుల అభ్యున్నతికి కూడా తోడ్పాటు అందించాలన్నదే లక్ష్యం. ఈ భావాన్ని అర్థం చేసుకుంటే చాలు.. ఇన్‌కం ట్యాక్స్ విభాగమంటే భయం ఉండదు‘ అని ఆమె తెలిపారు. సులభసాధ్యమైన లక్ష్యం.. 2019–20లో నిర్దేశించుకున్న రూ. 13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సులభసాధ్యమైనదేనని నిర్మలా సీతారామన్ చెప్పారు.‘గడిచిన అయిదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెట్టింపు స్థాయికి చేర్చగలిగాం. అలాంటప్పుడు పన్ను వసూళ్లను రూ. 11.8 లక్షల కోట్ల నుంచి కాస్త ఎక్కువగా రూ. 13 లక్షల కోట్లకు పెంచుకోవడం పెద్ద కష్టం కానే కాదు. సాధించతగిన లక్ష్యాన్నే మీకు నిర్దేశించడం జరిగింది‘ అని ఆమె వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యించినట్లుగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచే దిశగా కృషి చేయాలని చెప్పారు. ఆహ్లాదకర వ్యవహారంగా ఉండాలి.. పన్ను చెల్లింపు ప్రక్రియ అంటే భయం కోల్పేదిగా కాకుండా ఆహ్లాదకరమైన వ్యవహారంగా ఉండే పరిస్థితులు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ చెప్పారు. పన్ను వసూళ్లు పారదర్శకమైన, సముచిత రీతిలో జరిగేట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూడాలని ఆయన సూచించారు. 1960–61 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 13 లక్షలుగా ఉన్న ప్రత్యక్ష పన్ను వసూళ్లను గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.11.37 లక్షల కోట్ల స్థాయికి చేర్చడంలో ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని మోదీ చెప్పారు. -
చంద్రబాబు పాలనకు 1500 రోజులు
-
బాబు అవినీతిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి
-
శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఫలితాలు...
ఈ సంవత్సరం రాజు శుక్రుడు, మంత్రి, సేనాధిపతి, ఆర్ఘాధిపతి, మేఘాధిపతి బుధుడు, సస్యాధిపతి, నీరసాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, రసాధిపతి చంద్రుడు. నవనాయకుల్లో ఏడుగురు శుభులు, మిగతా ఇద్దరు పాపులు. అలాగే, ఉపనాయకుల్లోని 21మందిలో 10మంది శుభులు, మిగతా వారు పాపులు. రాజు శుక్రుడు కావడం, మంత్రి బుధుడు కావడం, ఇద్దరూ మిత్రులైనందున పాలనాపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ప్రజలు ఆశించిన రీతిలో పాలన కొనసాగుతుంది. పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరిగి అన్యోన్యంగా జీవిస్తారు. పాల ఉత్పత్తి అధికమై దీనిపై ఆధారపడిన వారికి మంచిరోజులని చెప్పవచ్చు. అలాగే, మంత్రి బుధుడు కావడం వల్ల మేఘాలు, గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మొత్తం మీద పరిశీలించగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు. వీరు తీసుకునే నిర్ణయాలు ప్రజల తిరస్కారానికి గురికాగలవు. శాంతిభద్రతల లోపంతో దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఘర్షణలు, ఉద్యమాలు చెలరేగి ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశాలున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య కూడా వివాదాలు నెలకొని పాలనపై ప్రభావం చూపవచ్చు. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో పాలకులు మారవచ్చు. ఇరుగుపొరుగు దేశాలతో కొంత కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇందుకోసం సైనికచర్యలు సైతం తప్పని పరిస్థితి నెలకొంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలు మరింత పుంజకుంటాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ విస్తరించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక వ్యవసాయరంగం కొద్దిపాటి ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. సరైన గిట్టుబాటు ధరలు రైతులు నిరాశకు గురికాగలరు. ఈ ఏడాది నల్లరేగడి భూములలో పంటలు బాగా పండుతాయి. వాణిజ్యపంటలు ఎక్కువగా పండుతాయి. తూర్పు, ఉత్తర ప్రాంతాలలో సుభిక్షం. ఇతర ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు కావడం వల్ల నువ్వులు, తెల్లధాన్యాల దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. తూర్పు, ఈశాన్యప్రాంతాల్లో అధికంగానూ, దక్షిణ, నైరుతి ప్రాంతాల్లో సామాన్యంగా వర్షాలు కురుస్తాయి. బంగారం, వెండి, రాగి లోహాల ధరలు పెరిగే సూచనలు. శుక్రుడు రాజుకావడం వల్ల నాలుగు కుంచాల వర్షం కురుస్తుంది. ఇందులో 8భాగాలు సముద్రమందు, 9భాగాలు పర్వతాలపై, 3భాగాలు నేలపై కురుస్తాయి. ఈ ఏడాది వర్షలగ్నం కన్యరాశి అయినది. లగ్న, దశమాధిపతి బుధుడు లాభాధిపతి చంద్రునితో కలిసి అష్టమస్థితి, ద్వితీయ, భాగ్యాధిపతి శుక్రుడు సప్తమమైన మీనంలో ఉచ్ఛస్థితి కలిగి వ్యయాధిపతి రవితో కలయిక. తృతీయ మందు తృతీయ, అష్టమాధిపతి కుజుడు, పంచమ, షష్టమాధిపతి అయిన శనితో చేరియుండుట, చతుర్ధ, సప్తమాధిపతి గురుడు రాహువుతో చేరి వ్యయస్థానం, కేతువు షష్ఠమస్థానంలోనూ సంచారం. ఇక జగర్లగ్నం వృశ్చికమైనది. లగ్నంలో కుజ, శనుల కలయిక శుభంకాదు. రవి, శుక్రులకు ఉచ్ఛస్థితి. అష్టమంలో చంద్రుడు, గురు, రాహువులు రాజ్యస్థానంలో కలయిక. వీటిరీత్యా చూస్తే పాలకులలో పారదర్శకత లోపిస్తుంది. ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటారు. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు ఈ ఏడాది శుభదాయకంగా ఉంటుంది. కోరుకున్న ఉద్యోగావకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులకు కూడా అనుకూలమైనదే. రాజు శుక్రుడు కావడం వల్ల చిత్రపరిశ్రమ పుంజుకుంటుంది. కళాకారులకు గతం కంటే ప్రోత్సాహవంతంగా ఉంటుంది. తూర్పు, ఈశాన్యరాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతాయి. అలాగే, వరదలు సంభవించి ఆస్తినష్టం కలిగే అవకాశం. దేశంలోని మధ్యప్రాంతంలో భూకంపాది ప్రకృతి వైపరీత్యాల వల్ల జన, ఆస్తినష్టాలు. కేంద్ర, రాష్ట్రాల మంత్రివర్గాలలో మార్పులు జరుగుతాయి. మహిళలకు విశేష గౌరవం లభిస్తుంది. మహిళల శ్రేయస్సుకు ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రారంభిస్తాయి. అత్యున్నతస్థాయి పదవులకు మహిళలు ఎంపిక కావచ్చు. ఈ ఏడాది పేరుప్రఖ్యాతులు, విశేష ఆదరణ పొందిన నేతకు గడ్డుకాలమనే చెప్పాలి. విమాన, రైలు, బస్సు ప్రమాదాల కారణంగా జననష్టం. పశుపోషణ, మత్స్య, ఇతర వ్యవసాయానుబంధ రంగాలపై ఆధారపడిన వారికి మంచి రోజులు. మొత్తం మీద కొన్ని ఒడిడుదుడుకులు ఎదురైనా ప్రజలకు అనుగుణంగా పాలకులు వ్యవహరించే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే సూచనలు. షేర్ మార్కెట్ తరచూ పతనావస్థకు చేరి ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనా రాజు, మంత్రి శుక్రుడు, బుధుడు కావడం వల్ల మన దేశ ఖ్యాతి నలుదిశలా విస్తరించే అవకాశం ఉంది. క్రీడారంగం కొత ్తపుంతలు తొక్కుతుంది. క్రీడాకారులకు విశేష గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఈ ఏడాది వైశాఖం చివరి నుంచి చిరుజల్లులు, అక్కడక్కడా వడగళ్లు పడవచ్చు. శ్రావణం, భాద్రపద మాసాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఉద్యమాలు పుట్టి పాలకులకు సవాలుగా మారతాయి. అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారం మధ్యలో కాలసర్పదోషం కారణంగా విచిత్ర వ్యాధులు, చోరీలు, ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. దుర్ముఖినామ సంవత్సరంలో ప్రజల్లో పాపభీతి తగ్గి, నేరాలు పెరుగుతాయి. ఉన్మాద, తీవ్రవాద చర్యలతో సమస్యలు ఎదురుకావచ్చు. జ్యేష్ఠ బ.విదియ, బుధవారం అనగా జూన్ 22వ తేదీ ఉదయం 6.39గంటలకు పూర్వాషాఢ నక్షత్రం, బ్రహ్మయోగం, గరజి కరణం, మిథున లగ్నమందు రవి ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశం. ఈరీత్యా చూస్తే ఉదయం పూట రవి ఆరుద్రనక్షత్ర ప్రవేశం, బ్రహ్మయోగం వల్ల పంటలకు నష్టం, ప్రజలకు కష్టాలు. బుధవారం, విదియ తిథి, గరజి కరణమైనందున సుభిక్షం, సకాలంలో వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది పశుపాలకుడు శ్రీకృష్ణుడు, గోష్టప్రాపకుడు, గోష్టబహిష్కర్త బలభద్రుడు కావడం వల్ల పశుసంపద, పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఉగాది నుంచి 2017 జనవరి 26 వరకు అఢకం(కుంచం) వృద్ధగోపకుని చేతిలో ఉండడం శుభం. పంటలు బాగా పండుతాయి. తదుపరి సంవత్సరాంతం వరకూ బ్రాహ్మణ బాలుని చేతిలో ఉండడం వల్ల కొంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. (వచ్చే ఏడాది శ్రీహేవిళంబినామ సంవత్సరం.) నవనాయకుల ఫలాలు... రాజు- శుక్రుడు... మంచి వర్షాలు కురిసి పంటల ఉత్పత్తులు అధికమవుతాయి. మహిళలకు ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. కళాకారులకు గుర్తింపు, సన్మానాలు అందుతాయి. బంగారం, వెండి, సుగంధ ద్రవ్యాలు, రాగి, తెల్లని ధాన్యాలు, వేరుశెనగ వంటి నూనె గింజలు, మిర్చి, పసుపు ధరలు పెరుగుతాయి. మంత్రి- బుధుడు... ఏడాదంతా మధ్యమ ఫలితాలు ఉంటాయి. నూనెగింజల ధరలు అధికమవుతాయి. చక్కటి సలహాలతో పాలకులు పాలన చేస్తారు. అకాల మబ్బులు, వాయువులతో ఆకాశం నిండి ఉంటుంది. సేనాధిపతి -బుధుడు... రాజకీయ నాయకులకు తరచూ ఇక్కట్లు ఎదురవుతాయి. నాయకులు, ప్రజలలో నిబద్ధత లోపిస్తుంది. వాయువులతో కూడిన వర్షాలు కురుస్తాయి.సస్యాధిపతి -శని... నువ్వులు, నల్లటి ధాన్యాల ఉత్పత్తులు పెరుగుతాయి.నల్లరేగడి భూములలో పంటలు బాగా పండుతాయి. బెల్లం, చింతపండు, పొగాకు ఇనుము వంటి ధరలు పెరుగుతాయి. ధాన్యాధిపతి - శుక్రుడు... సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉంటుంది. అన్ని రకాల ధాన్యాలు బాగా పండుతాయి. సుగంధ ద్రవ్యాలకు గిరాకీ పెరుగుతుంది. అర్ఘాధిపతి- బుధుడు... పంటలు, వర్షాలు, ధరలు అధికంగా ఉంటాయి. నెయ్యి, పాలు, బంగారం, వెండి, పసుపు, కలప, కాగితం ధరలు పెరుగుతాయి. మేఘాధిపతి- బుధుడు... మధ్య ప్రాంతంలో పిడుగులు, వడగండ్లతో వర్షాలు కురుస్తాయి. రసాధిపతి- చంద్రుడు... ప్రజలు ఆరోగ్యవంతులై సుఖఃశాంతులతో జీవిస్తారు. నూనెలు, బెల్లం, కొబ్బరి, తేనె, పాలు చక్కెర ధరలు పెరుగుతాయి. నీరాసాధిపతి- శని... నల్లటి వస్త్రాలు, ఇనుము, ఇతర లోహాల ధరలు పెరుగుదల కనిపిస్తుంది. -
కేసీఆర్‌ది అనైతిక పాలన
-
బాబు పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది..