అమిత్‌షా కాన్వాయ్‌పై దాడి చేస్తున్న టీడీపీ మూకను అడ్డుకుంటున్న రక్షణ సిబ్బంది(ఫైల్)- తిరుమల ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. సరిగ్గా మూడున్నరేళ్ల కిందట జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో 2018 మే 11న తిరుమలకు విచ్చేశారు. ఆయన కుటుంబంతో సహా స్వామి వారి దర్శనం చేసుకుని తిరుపతికి వస్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద టీడీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. అయితే భద్రతా సిబ్బంది అమిత్ షా ప్రయాణిస్తున్న కారును వేగంగా ముందుకు కదిలించడంతో, రెచ్చిపోయిన టీడీపీ మూకలు కాన్వాయ్‌లోని ఓ కారు అద్దాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించాయి.
చదవండి: కుప్పానికి టీడీపీ దొంగ ఓటర్లు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ సాకుతో అమిత్ షా పర్యటనలో టీడీపీ మూకలు చెలరేగిపోయి. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబే దాడికి ఉసిగొల్పారని, ఆయన ఆదేశాల మేరకే టీడీపీ శ్రేణులు అమిత్‌షా కాన్వాయ్‌పై తెగబడ్డాయని బీజేపీ నేతలు ఆరోపించారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసి సీఎం అయిన చంద్రబాబు అదే బీజేపీ జాతీయ అధ్యక్షుడుని అవవనించారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆ వాదనలకు తగ్గట్టుగానే అమిత్‌షా కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన వారిపై నామమాత్రపు కేసులు పెట్టిన టీడీపీ సర్కారు నిందితులను పూర్తిగా పక్కకు తప్పించేసింది. పైగా ఆ ఘటనలో పాల్గొన్న, సారథ్యం వహించిన కార్యకర్తలకు ఆ తర్వాత పార్టీలో పదోన్నతులు, కార్పొరేటర్ టికెట్లు బహుమానంగా అందించింది.
దగ్గరుండి తిరుమల దర్శనానికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి
తిరుపతి వేదికగా ఆదివారం జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు అమిత్ షా శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేశారు. అమరావతి నుంచి ముందుగానే అక్కడికి వివనంలో చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమిత్‌షాకు ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఆయనతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. దగ్గరుండి శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. అనంతరం అమిత్ షా నగరంలో బస చేసిన తాజ్ హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత సీఎం రాత్రి 12 గంటల సమయంలో అమరావతికి బయలుదేరారు.
బీజేపీతో ఎలాంటి పొత్తు లేకపోయినా, సైద్ధాంతిక పరమైన విభేదాలు ఉన్నా.. రాష్ట్ర వాటాల కోసం కేంద్రంతో పోరాడుతున్నా.. ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ.. రాష్ట్రానికి వచ్చిన అతిథిగా అమిత్ షాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత గౌరవ మర్యాదలను అందించారు.
ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. నాడు బాబు జమానాలో తిరుపతిలో అమిత్ షాకు జరిగిన అవమానం.. నేడు వైఎస్ జగన్ హయాంలో అదే తిరుపతిలో లభించిన గౌరవం.. పోల్చి చస్తున్న పరిశీలకులు రాజకీయాల్లోనూ, నైతిక విలువల్లోనూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకి.. మహానేత తనయుడు జగన్‌కి ఉన్న తేడా ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment