గణేశ్ నిమజ్జనం సజావుగా జరగడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు, గంటల తరబడి నిరీక్షణ, తొక్కిసలాట లేకుండా నిమజ్జనం కార్యక్రమం పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆద్యంతం అప్రమత్తంగా వ్యవహరించిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.
Published Fri, Sep 16 2016 8:58 AM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement