satisfied
-
ఏపీ గృహ నిర్మాణంపై కేంద్రం సంతృప్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ పథకాల అమలుపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు హౌసింగ్ లేఅవుట్ వద్ద జరుగుతున్న పీఎంఏవై–అర్బన్ గృహ నిర్మాణాలను కేంద్ర అధికారుల బృందం శనివారం పరిశీలించింది. పీఎంఏవై–అర్బన్ హౌసింగ్ డైరెక్టర్ ఆర్కే గౌతమ్, ఇంజినీర్లు సునీల్ పరేఖ్, మనీష్‌తో కూడిన బృందం సభ్యులు స్థానిక లబ్ధిదారులతో మాట్లాడారు. వారి గత, ప్రస్తుత జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లతో పాటు నిర్మాణంలో వినియోగిస్తున్న ఇటుకలు, సిమెంట్ తదితర సామగ్రిని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు కేంద్ర బృందం విజయవాడలోని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమాలపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 5 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించిందని, మిగిలిన ఇళ్లను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తోందని రాష్ట్ర అధికారులు వివరించారు. అలాగే కేంద్ర బృందం మంగళగిరిలోని టిడ్కో ఇళ్లను పరిశీలించి అక్కడి లబ్ధిదారులతో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కేంద్ర బృందం వెంట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ జేఎండీ కె.శివప్రసాద్, చీఫ్ ఇంజినీర్ జి.వి.ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్లు వెంకట్‌రెడ్డి, ఎస్ఈలు జయరామాచారి, నాగభూషణం తదితరులున్నారు. -
అంతా బాగుంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు తీరు, వైరస్ వ్యాప్తి నియంత్రణకు సర్కా రు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణకు వచ్చిన కేంద్ర బృందం మూడోరోజు సోమవారం హైద రాబాద్‌లో విస్త్రృతంగా పర్యటించింది. కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్‌బరోకా, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్, జాతీయ పోషకాహార సంచాలకురాలు డాక్టర్ హేమలత, జాతీయ వినియోగదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ ఠాకూర్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేదిల బృందం.. ఉదయం ఖైరతాబాద్ పరిధిలోని రెండు కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. పలు అంశాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకుంది. అక్కడి ఏర్పాట్ల న్నీ బాగున్నాయని సంతృప్తి వ్యక్తంచేసింది. అనంతరం మెహిదీపట్నంలోని సరోజిని కంటి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడున్న హైదరాబాద్ జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను పరిశీలించింది. ఎటువంటి పరిస్థితులెదురైనా అందుకవసరమైన మందుల లభ్య త, స్టాకు రికార్డు, టెస్టింగ్స్ కిట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకుంది. గాంధీ వైరాలజీ ల్యాబ్ సందర్శన... సాయంత్రానికి గాంధీ ఆస్పత్రికి చేరుకున్న కేంద్ర బృందం.. గాంధీ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించింది. వైద్య పరికరాలు, పరీక్షల కోసం వాడుడుతు న్న కిట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించింది. రోజుకు ఎక్కడ, ఎన్ని శాంపిల్స్ సేకరిస్తున్నారు? ఎలా సేకరిస్తున్నారు? వాటిని ఇక్కడికి ఎలా తీసుకొస్తున్నారు? రిపో ర్టుల జారీకి ఎంత సమ యం పడుతోంది వంటి అంశాలపై ఆరా తీసింది. కరోనా ప్రత్యేక వార్డులో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని ప్రశంసించింది. అనం తరం వైద్యాధికారులతో సమావేశమై.. గాంధీ ఆస్పత్రిలో ఉన్న పడకలు, ఐసీ యూ పడకలు, వెంటిలేటర్ల లభ్యత గురిం చి వివరాలు సేకరించింది. కేంద్ర బృం దం తమ పర్యటనను మరోరోజు పొడిగించుకుంది. మంగళవారం ఈ బృందం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో భేటీ కానుంది. -
సేవ కోసం నిరీక్షణ
హజ్రత్ షర్ఫుద్దీన్ ధార్మిక భావాలు గల యువకుడు. తల్లిదండ్రుల సేవ చేయడంలో అతనికి అతనే సాటి. ఒకసారి అతని తల్లి జబ్బున పడింది. మూలుగుతూ తనయుణ్ణి పిలిచి ‘‘నాయనా దాహమేస్తోంది కాసిన్ని మంచినీళ్లివ్వు’’ అని అడిగింది. తల్లి దాహం తీర్చేందుకు కడవ దగ్గరికి హుటాహుటిన నీళ్లకోసం పరిగెత్తాడు షర్ఫుద్దీన్. ఆ వెంటనే పాత్రలో నీళ్లతో తల్లిముందు ప్రత్యక్షమయ్యాడు. ఈలోగా ఆయన తల్లి నిద్రలోకి జారుకుంది. ‘అమ్మను నిద్రనుంచి మేల్కొలిపితే నిద్రాభంగమవుతుంది. దాహం తీర్చకపోతే అమ్మ పట్ల అవిధేయత చూపినవాడను అవుతాను’ అని మనస్సులోనే అనుకోసాగాడు. అలా నీళ్ల పాత్రను చేతిలో పట్టుకొని తల్లి తలాపు వైపున నిల్చుండిపోయాడు. తన తల్లి ఏ క్షణంలో మేల్కొని నీళ్లు అడుగుతుందోనని పడిగాపులు కాసాడు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ఇలానే నిల్చుండిపోయాడు. చాలా పొద్దుపోయాక తల్లి నిద్ర నుండి మేల్కొన్నది. కళ్లు తెరిచి చూసేసరికి నీటి పాత్రతో షర్ఫుద్దీన్ నిలబడి ఉన్నాడు. ‘‘అప్పటి నుండి నీవు ఇలా నిల్చునే ఉన్నావా నాయనా’’ అని ఆప్యాయతతో అడిగింది తల్లి. ‘‘అవునమ్మా నీవు నిద్రనుంచి లేవగానే నీళ్లు ఇద్దామని ఇక్కడే నిల్చుండిపోయానమ్మా’’ అని సమాధానమిచ్చాడు. షర్ఫుద్దీన్. తన ముద్దుల కుమారుడి సేవకు ఆ తల్లి ఎంతగానో ఆనందించింది. కొడుక్కి ఆశీర్వచనాలు అందించింది. – సుహైబ్ -
పిల్లలూ..నేను వెళ్లిపోతున్నా!
గీసుకొండ(పరకాల): పిల్లలూ ఇక సెలవు..నేను వెళ్లిపోయే సమయం వచ్చింది. 65 సంవత్సరాలకు పైగా మీకు విద్యనందించిన నేను అలసి సొల శిథిలమైపోయే స్థితికి చేరుకున్నా. వేలాది మంది విద్యార్థులను అక్కున చేర్చుకుని భావి పౌరులుగా తీర్చిదిద్దానని, నా నీడన చదివిన వారెందరో ప్రయోజకులయ్యారనే తృప్తి నాకు ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, కండక్టర్లు, డ్రైవర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతోపాటు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న నా విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ధర్మారం చుట్టు పక్కల పది గ్రామాలకు చెందిన ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పింది నేనే అని చెప్పడానికి ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఉదయం లేచింది మొదలు సాయంత్రం అయ్యే వరకు ప్రతిరోజు నావద్దే మీ చదువు, ఆటపాటలు సాగాయి. చదువులమ్మ ఒడినై మిమ్ములను కన్న తల్లిలా లాలించా. తండ్రిలా ముందుకు నడిపించా. ఇక నాకు వెళ్లిపోయే సమయం వచ్చిందని అధికారులు నిర్ధారించారు. రేకులు, డంగు సున్నంతో నిర్మించిన నా రూపాన్ని లేకుండా చేయడానికి వేలం పాట నిర్వహించారు. నన్ను కూల్చడానికి ఓ కాంట్రాక్టర్ రూ. 2.55 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. త్వరలోనే ఆయన తన పని ప్రారంభించి నన్ను నేలమట్టం చేస్తాడు. నేను లేనని మీరు బాధపడొద్దు. నా పునాదులపైనే కొత్తగా తరగతి గదులను త్వరలో నిర్మిస్తారు. మిమ్ములను వీడి కాలగర్భంలో కలిసి పోతున్నాననే బాధ నాకు లేదు. చాలా సంతోషంగా, సంతృప్తిగా వెళ్లిపోతా.. మీ జ్ఞాపకాలు చాలు నాకు..ఇక సెలవు..ప్రేమానురాగాలతో.. -
రైతుల నోట్లో బాబు మట్టి
-
నిమజ్జనంపై సీఎం సంతృప్తి
-
నిమజ్జనంపై సీఎం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సజావుగా జరగడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు, గంటల తరబడి నిరీక్షణ, తొక్కిసలాట లేకుండా నిమజ్జనం కార్యక్రమం పూర్తికావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆద్యంతం అప్రమత్తంగా వ్యవహరించిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సకాలంలో జరగడంతో మొత్తం కార్యక్రమం అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు వీలయిందన్నారు. -
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి అసంతృప్తి
-
‘అంతా’ పులకించే..
భద్రాద్రిలో వైభవంగా ప్రారంభమైన గోదావరి అంత్య పుష్కరాలు తొలి రోజు 30 వేలమంది పుణ్యస్నానాలు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగిన తీరం ప్రవిత్ర స్నానం, రామయ్య దర్శనంతో పునీతం పుష్కర స్నానమాచరించిన హైకోర్టు జడ్జి గోదారమ్మకు శాస్త్రోక్తంగా నదీ హారతి గోదావరి తీరం పులకించింది. భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. ఊరేగింపు, పూజలు, పుణ్యస్నానాలతో సందడిగా మారింది. భద్రాద్రిలో గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభమైన వేళ.. వేలాది మంది భక్తులు జై శ్రీరామ్ అంటూ పుష్కరస్నానమాచరించారు. పిండప్రదానాలు చేసి.. పితృతర్పణాలు వదిలారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ.. ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు.. భక్తజనం తోడు రాగా.. సుందరంగా అలంకరించిన లాంచీపై స్వామివారిని ఆశీనుల చేశారు. ఆదివారం ప్రారంభమైన గోదావరి అంత్య పుష్కర వేడుక 11వ తేదీతో ముగుస్తుంది. వేలాది భక్తుల పుణ్యస్నానాలతో గౌతమి తీరం శోభాయమానంగా కనిపించింది. సాయంత్రం నదీ హారతితో మరింతగా కాంతులీనింది. భద్రాచలం : భద్రాచలంలో గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కర ఘడియలు సమీపించగానే గోదావరి తీరం రామనామ స్మరణతో మార్మోగింది. పవిత్ర స్నానం ఆచరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావటంతో తీరం జన సందోహంగా మారింది. భద్రాద్రి ఆలయం నుంచి శ్రీసీతారామచంద్రస్వామివారి ప్రచార మూర్తులు, చక్రపెరుమాళ్లు, శ్రీపాదుకలు, శ్రీభగవద్రామానుజాచార్య స్వామి వారులతో ఊరేగింపుగా వెళ్లారు. మెట్లరేవు వద్ద ఉన్న గోదావరి మాత విగ్రహానికి ఈఓ రమేష్‌బాబు పూజలు చేసి, నూతన వస్త్రాలను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ, దేవస్థానం ఆస్థానవిద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ.. భక్తజనం తోడుగా గోదావరి తీరానికి చేరుకున్నారు. సుందరంగా అలంకరించిన లాంచీపై అన్నింటినీ ఆశీనుల చేశారు. శ్రీరామానుజాస్వామివారికి అభిషేకం.. ఆపై పుష్కరస్నానం శ్రీరామానుజాచార్యస్వామి వారికి అభిషేక కార్యక్రమంలో భాగంగా ముందు విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. గోదావరి అంత్య పుష్కరాల విశిష్టతను దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వివరించారు. శ్రీరామానుజాచార్యస్వామి వారికి గోదావరి జలాలతో అభిషేకం జరిపారు. గోదారమ్మకు పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, దుస్తులు సమర్చించారు. మంగళ హారతులు ఇచ్చారు. శ్రీపాదుకలతో అర్చకులు, వేద పండితులు, భక్తజనం తోడుగా సామూహికంగా పుష్కర స్నానమాచరించారు. ఆ సమయాన గోదావరి తీరంలో ఉన్న భక్తులంతా జై శ్రీరామ్ అంటూ పుష్కర స్నానం చేశారు. భక్తులు గోదావరి ఒడ్డున ప్రత్యేక పూజలు చేసి, గోదారమ్మకు హారతులు ఇచ్చి దీపాలను వదిలారు. పునర్వసు మండపంలో కొలువుదీరిన స్వామి గోదావరి తీరంలోని పునర్వసు మండపంలో శ్రీసీతారాముల వారి ప్రచార మూర్తులను ఉంచారు. అంత్య పుష్కరాలను ప్రారంభించిన అనంతరం చక్రపెరుమాళ్లు, శ్రీపాదుకలు, శ్రీభగవద్రామానుజార్యులను పునర్వసు మండపానికి తీసుకొచ్చి కొద్ది సేపు ఆశీనుల చేశారు. పునర్వసు మండపంలో ఉంచిన స్వామివారి మూర్తులకు స్నపన తిరుమంజనం గావించి.. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అంత్య పుష్కరాలకు వచ్చి రామాలయాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగి వెళ్లే భక్తుల కోసం ఈ ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో భక్తజన సందడి అంత్యపుష్కరాల మొదటి రోజు ఆదివారం సుమారు 30 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. స్నానాలు ఆచరించిన భక్తులు గోదారమ్మకు పూజలు చేశారు. నదిలో పసుపు, కుంకుమ, దీపాలను వదిలారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. పుష్కరాల ప్రారంభంతో గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 11 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల రాక పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి ఘాట్‌లో ఎటువంటి ప్రమాదం జరగకుండా గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. పుష్కర స్నానమాచరించిన హైకోర్టు జడ్జి అంత్య పుష్కరాల్లో పాల్గొనేందుకు భద్రాచలం వచ్చిన రాష్ట్ర హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ పుణ్యస్నానమాచరించారు. ఆయనతో పాటు జిల్లా జడ్జి విజయ్‌మోహన్, భద్రాచలం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బులికృష్ణ ఉన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హనుమంతు గోదావరికి పూజలు చేశారు. వారిని అర్చకులు ఆశీర్వదించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బేగ్ తదితరులు పుష్కర స్నానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమేష్‌బాబు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఇరిగేషన్ శాఖ ఈఈ ప్రసాద్, భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, తహశీల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా నదీ హారతి అంత్య పుష్కరాల్లో భాగంగా గోదారమ్మకు ఆదివారం రాత్రి వైభవంగా నదీ హారతి ఇచ్చారు. ఆలయం నుంచి ఊరేగింపుగా అర్చకులు, వేదపండిపతులు గోదావరి తీరానికి చేరుకున్నారు. లాంచీ ఎక్కి ఈఓ రమేష్‌బాబు గోదారమ్మకు పూజలు నిర్వమించారు. అనంతరం శాస్త్రోక్తంగా నదీ హారతి ఇచ్చారు. -
'అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా జరిగింది'
న్యూఢిల్లీ: సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో.. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ఎన్డీఏ కోరింది. అలాగే పెండింగ్ బిల్లుల ఆమోదంపై చర్చ జరిగింది. జీఎస్టీ బిల్లుతో సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. ఈ సందర్భంగా అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చాయని, సమావేశం సంతృప్తిగా జరిగిందని మంత్రి అనంతకుమార్ తెలిపారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ తరఫున మేకపాటి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు అన్ని పార్టీలు అంగీకరించాయని, ఈ బిల్లుతో అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. -
'అఖిలపక్ష సమావేశం సంతృప్తిగా జరిగింది'
-
చత్తీస్‌గఢ్‌లో ప్రజాపంపిణీ బాగుంది:బాబు
-
నాకు ఇంకా సంతృప్తి లేదు
టాలీవుడ్ నంబర్‌వన్ హీరోయిన్ అనగానే... తడుముకోకుండా వచ్చే సమాధానం సమంత. వరుస విజయాలతో సాటిలేని హీరోయిన్లా దూసుకుపోతోందీ చెన్నయ్ చందమామ. అయితే... టాప్ పొజిషన్ని ఎంజాయ్ చేస్తున్నా, కెరీర్ పరంగా తృప్తి లేదంటూ ఇటీవల మీడియా సాక్షిగా వాపోయారు సమంత. ‘‘వరుసగా హిట్స్ వస్తున్నాయని ఆనంద పడాలో, మంచి నటిగా ఇంకా నిరూపించుకోలేకపోయానని బాధ పడాలో అర్థం కావడం లేదు. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ నాకు మంచి పేరునే తెచ్చాయి. అయితే... ఆర్టిస్టుగా అంతటితో సతృప్తి పొందలేను. ఇంకా సాధించాలి. సమంత స్టార్ మాత్రమే కాదు, గొప్ప నటి కూడా అని అందరూ ప్రశంసించాలి. అలాంటి పేరు తెచ్చే పాత్ర కోసమే ఎదురు చూస్తున్నా. నటిగా ఎలాంటి పాత్రనైనా చేసే సత్తా నాకుంది. డీ గ్లామరైజ్డ్ క్యారెక్టరైనా ఫర్వాలేదు. పారితోషికం గురించి కూడా పెద్దగా పట్టించుకోను’’ అని తన ఆకాంక్షను వెలిబుచ్చారు సమంత.