హైదరాబాద్‌లో వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తీరు, వైరస్ వ్యాప్తి నియంత్రణకు సర్కా రు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణకు వచ్చిన కేంద్ర బృందం మూడోరోజు సోమవారం హైద రాబాద్‌లో విస్త్రృతంగా పర్యటించింది. కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్‌బరోకా, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్, జాతీయ పోషకాహార సంచాలకురాలు డాక్టర్ హేమలత, జాతీయ వినియోగదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్‌ఎస్ ఠాకూర్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేదిల బృందం.. ఉదయం ఖైరతాబాద్ పరిధిలోని రెండు కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. పలు అంశాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకుంది. అక్కడి ఏర్పాట్ల న్నీ బాగున్నాయని సంతృప్తి వ్యక్తంచేసింది. అనంతరం మెహిదీపట్నంలోని సరోజిని కంటి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడున్న హైదరాబాద్ జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను పరిశీలించింది. ఎటువంటి పరిస్థితులెదురైనా అందుకవసరమైన మందుల లభ్య త, స్టాకు రికార్డు, టెస్టింగ్స్ కిట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకుంది.
గాంధీ వైరాలజీ ల్యాబ్ సందర్శన...
సాయంత్రానికి గాంధీ ఆస్పత్రికి చేరుకున్న కేంద్ర బృందం.. గాంధీ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించింది. వైద్య పరికరాలు, పరీక్షల కోసం వాడుడుతు న్న కిట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించింది. రోజుకు ఎక్కడ, ఎన్ని శాంపిల్స్ సేకరిస్తున్నారు? ఎలా సేకరిస్తున్నారు? వాటిని ఇక్కడికి ఎలా తీసుకొస్తున్నారు? రిపో ర్టుల జారీకి ఎంత సమ యం పడుతోంది వంటి అంశాలపై ఆరా తీసింది. కరోనా ప్రత్యేక వార్డులో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని ప్రశంసించింది. అనం తరం వైద్యాధికారులతో సమావేశమై.. గాంధీ ఆస్పత్రిలో ఉన్న పడకలు, ఐసీ యూ పడకలు, వెంటిలేటర్ల లభ్యత గురిం చి వివరాలు సేకరించింది. కేంద్ర బృం దం తమ పర్యటనను మరోరోజు పొడిగించుకుంది. మంగళవారం ఈ బృందం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో భేటీ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment