మానవులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో మరో ముందడుగు వేసిందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇది గుర్తుంచుకోవాల్సిన రోజు అని ఆయన పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ అందరి కృషితోనే ప్రయోగం విజయవంతమైందన్నారు. క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలోకి చేరుకుందని రాధాకృష్ణన్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి రూ.155 కోట్లు వ్యయం అయినట్లు ఆయన తెలిపారు.
Published Thu, Dec 18 2014 10:26 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement