నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్-3 | All set for launch of GSLV Mark-III, India's largest rocket | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 18 2014 9:45 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం ఉదయం 9.30 గంటలకు నింగిలోకి వెళ్లిన ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ను అమర్చినట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యిందని స్పష్టం చేశారు. భూమి నుంచి 136 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేస్తుంది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకోనుంది. అండమాన్ కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్ వీ మార్క్-3 ని ప్రయోగించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement