GSLV Mark 3
-
ఇస్రో బృందాన్ని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. భారత అంతరిక్ష చరిత్రలో ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవతరించింది. ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, భారత్‌కు చెందిన భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశట్టారు. చదవండి: సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేశారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున.. 9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయి వాణిజ్యపరంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కలిసి వన్‌వెబ్ పేరుతో చేసిన రెండో ప్రయోగమిది. My best wishes and congratulations to the team at @isro on the successful launch of the LVM3 rocket from Satish Dhawan Space Centre in Sriharikota, #AndhraPradesh. This day will always be remembered as an important milestone in Indian space history. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 26, 2023 -
జీఎస్ఎల్వీ మార్క్3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఎల్వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవతరించింది. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందన్నారు. తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఎల్వీఎం3–ఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందుకోసం ఇస్రో అధికారులు శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. 24.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రయోగం షురూ అయింది. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం నుంచే రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఆదివారం ఉదయానికి రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగాన్ని నిర్వహించారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం రాత్రి షార్కు చేరుకుని ప్రయోగంపై సమీక్షించారు. ఆయన ఆధ్వర్యంలోనే శనివారం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, భారత్‌కు చెందిన భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున.. 9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. పూర్తి స్థాయి వాణిజ్యపరంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కలిసి వన్‌వెబ్ పేరుతో చేస్తున్న రెండో ప్రయోగమిది. देखें | 36 उपग्रहों को ले जाने वाला LVM3-M3 वनवेब इंडिया-2 मिशन श्रीहरिकोटा के स्पेसपोर्ट से लॉन्च किया गया। @isro #ISRO #LVM3M3/#Oneweb India-2 Mission - https://t.co/pqnE7LbXBy pic.twitter.com/9w2yK7e8gA — Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) March 26, 2023 -
సాకారం దిశగా గగనయానం.. ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట: ఇస్రో గండరగండులు ఇకపై అంతరిక్షంలో విహరించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత ప్రయోగాలే లక్ష్యంగా ఈ ఏడాది చివరికి లేదా 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్–1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేసేందుకు పలు రకాల భూస్థిర పరీక్షలు చేసి రాకెట్ సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇస్రో సన్నద్ధమవుతోంది. గగన్‌యాన్–1కు సంబంధించి తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని స్ప్రాబ్ విభాగంలో ఈ నెల 13న ఎస్–200 (ఘన ఇంధన మోటార్) భూస్థిర పరీక్షను ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. భారీ రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు, రెండో దశలో ఉపయోగించే ఎల్–110 సామర్థ్యంతో పాటు సుమారు 3.5 టన్నుల బరువు గల క్రూ మాడ్యూల్ (వ్యోమనాట్స్ గది)ను పంపించి మళ్లీ దాన్ని తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో సొంతంగా తయారు చేసుకుంది. క్రూ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రయోగించి పారాచూట్ల సాయంతో తిరిగి తీసుకొచ్చే విషయంలోనూ విజయం సాధించారు. దిగ్విజయంగా.. ప్యాడ్ అబార్ట్ టెస్ట్.. మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ అనే ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగంలో 259 సెకన్ల పాటు రాకెట్‌ను నాలుగు దశల్లో మండించి రెండు కిలోమీటర్ల మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి పారాచూట్ల ద్వారా క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 720 సెకన్లపాటు మండించి.. గగన్‌యాన్–1 ప్రయోగానికి సంబంధించి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో ఈ ఏడాది జనవరి 12న భూస్థిర పరీక్ష నిర్వహించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. క్రయోజనిక్ మోటార్లో 12 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకన్ల పాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించారు. ఈ ఇంజన్‌ను మరోమారు 1,810 సెకన్ల పాటు మండించి పరీక్షించేందుకుగాను మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఆర్ఎల్వీ టీడీ ప్రయోగమూ విజయవంతం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్(ఆర్ఎల్వీ–టీడీ)ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ తరహా రాకెట్ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువుగల హైపర్ సోనిక్ ఫ్లైట్‌ను విడుదల చేసింది. ఆ ఫ్లైట్ 65 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి వచ్చేందుకు రన్ వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 450 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు. దానికి ఇండియన్ కోస్టల్ గార్డ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. వ్యోమనాట్స్‌ను రోదసిలో వదిలిపెట్టి మళ్లీ క్షేమంగా తెచ్చేందుకు ఉపయోగపడే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు. (క్లిక్: తమిళనాడులో సబ్‌వేరియంట్ బీఏ.4 రెండో కేసు) -
వడివడిగా మామ చుట్టూ..
అంతరిక్ష చరిత్రలో భారత్.. తన కోసం మరికొన్ని పుటలను లిఖించుకుంది. చంద్రయాన్–2 ప్రయోగంలో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ‘బాహుబలి’ప్రవేశించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం చేపట్టిన ఆపరేషన్ విజయం సాధించింది. లిక్విడ్ ఇంజిన్‌ను మండించడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. అర్ధగంట పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఇప్పటిదాకా జరిగింది ఇదీ.. ► ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్–2ను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. ► ఆగస్టు 14న చంద్రుడి కక్ష్యగతి మార్గంలోకి మళ్లించారు. ► ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జరగబోయేది ఇదీ.. ► సెప్టెంబర్ 7న ఉదయం 1.55 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ (1,471 కేజీల బరువు) చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుంది. ► ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడిపోయి, చంద్రుడిపై అన్వేషణ ప్రారంభిస్తుంది. ► చంద్రయాన్ ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ.. అక్కడి విశేషాలను భూమిపైకి పంపుతూ ఉంటుంది. వడివడిగా.. చంద్రుడి దిశగా.. సాక్షి, బెంగళూరు/సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానసపుత్రిక చంద్రయాన్–2 అంతరిక్ష నౌక చంద్రుడి ఒడిని చేరేందుకు వడివడిగా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా ఈ ప్రయోగంలో అత్యంత కీలక ఘట్టం మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకు లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్–2 నౌక కీలకమైన చంద్రుడి కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. మంగళవారం ఉదయం 9.02 గంటల ప్రాంతంలో ఆర్బిటర్‌లోని ద్రవ ఇంజిన్‌ను 1,738 సెకన్లపాటు మండించి లూనార్ ఆర్బిట్‌లో అంటే చంద్రుడికి దగ్గరగా 114 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 18,072 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ చతురస్రాకారంలో ప్రవేశపెట్టి భారత ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారు. బెంగళూరు సమీపంలో బైలాలులోని భూనియంత్రిత కేంద్రం (మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్) నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. తదుపరి ప్రక్రియలకు సన్నాహాలు.. ఇక ప్రయోగంలో తదుపరి 18,072 కిలోమీటర్ల దూరాన్ని 4 విడతలుగా తగ్గించుకుంటూ వచ్చి చంద్రుడికి చతురస్రాకారంలో 100 కిలోమీటర్లుకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. తర్వాత 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ వచ్చి సెప్టెంబర్ 2వ తేదీన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ (విక్రమ్)ను విడిచిపెట్టే ప్రక్రియను చేపట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ఇక ప్రయోగంలో చివరిగా సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల్లోపు ల్యాండర్ నుంచి రోవర్ (ప్రజ్ఞాన్) బయటకు వచ్చి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి తన పరిశోధనలను ప్రారంభిస్తుంది. దశల వారీగా పరిశీలిస్తే.. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జూలై 22వ తేదీన చంద్రయాన్–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లు ఎత్తులో భూమధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా గత నెల 24వ తేదీ తొలి విడత, 26వ తేదీన రెండోసారి, 29వ తేదీన మూడోసారి, ఈ నెల 2వ తేదీన నాలుగోసారి, 6వ తేదీన ఐదోసారి ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని మండించి భూమికి దగ్గరగా 276 కిలోమీటర్లు, భూమికి దూరంగా 1,42,975 కిలోమీటర్లను విజయవంతంగా పెంపుదల చేశారు. ఈ నెల 14వ తేదీన ఆరోసారి లూనార్ ఆర్బిట్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్ నౌకను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు మొత్తం 6 సార్లు కక్ష్య దూరం పెంచే ఆపరేషన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఎలాంటి సాంకేతికపరమైన లోపం లేకుండా విజయవంతంగా నిర్వహించారు. ఆ అర్ధగంట.. అత్యంత ఉత్కంఠ.. చంద్రయాన్–2 మిషన్‌ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు మా శాస్త్రవేత్తలు ద్రవ ఇంథనాన్ని మండిస్తున్న సమయంలో నా గుండె కాసేపు ఆగినంత పనైంది. సుమారు ఈ ప్రక్రియ చేపడుతున్న అర్ధగంట సమయం అత్యంత ఉత్కంఠను ఎదుర్కొన్నా’అని మీడియా సమావేశంలో ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ల్యాండర్ చంద్రుడిపై దిగే సెప్టెంబర్ 7వ తేదీన ఇంతకంటే అత్యంత ఉత్కంఠ క్షణాలు ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభినందనలు.. చంద్రయాన్–2 వ్యోమనౌకను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయాణంలో మరో మైలురాయిని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ముగించారని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. -
చంద్రయాన్–2 కక్ష్య దూరం పెంపు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్ కేంద్రం నుంచి గత నెల 22న ప్రయోగించిన చంద్రయాన్–2 మిషన్‌కు సంబంధించి శుక్ర వారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట ర్లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. చంద్రయాన్–2 మిషన్ రోదసీలో ఆరోగ్యకరంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్ర వేత్తలు అధికారికంగా వెల్లడించారు. బెంగళూరు సమీపంలో బైలాలులో ఉన్న భూ నియంత్రిత కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్–2 మిషన్‌లోని ఆర్బిటర్‌లో నింపిన ఇంధన సాయంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను నాలుగోసారి కూడా విజయవంతంగా నిర్వహించారు. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక ద్వారా చంద్రయాన్–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్ల ఎత్తులో భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా గత నెల 24న మొదటి విడతలో భూమికి దగ్గరగా ఉన్న 170 కిలోమీటర్ల ఎత్తును 230 కిలోమీటర్లకు, 26న రెండోసారి భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లుగా ఉన్న కక్ష్య దూరాన్ని 54,829 కిలోమీటర్లకు, 29న చేపట్టిన ఆపరేషన్‌లో మూడోసారి భూమికి దగ్గర్లో ఉన్న 230 కిలోమీటర్ల దూరాన్ని 270 కిలోమీటర్లకు, దూరంగా ఉన్న 54,829 కిలోమీటర్ల దూరాన్ని 71,792 కిలోమీటర్లకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పెంచిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. తర్వాత 14న చివరిగా చంద్రయాన్–2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్
సాక్షి, శ్రీహరికోట : అంతరిక్ష చరిత్రలోనే భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్ కే.శివన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2 ప్రయోగానంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందన్నారు. అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశ విజయవంతంగా ముగిసిందని, నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశించిందని తెలిపారు. చంద్రుడిపై భారత్ చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఇదని అభివర్ణించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని చెప్పారు. ఇస్రో టీమ్ అహర్నిశలు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మూడు ఉపగ్రహాలను ఒకే రోవర్ ద్వారా ప్రయోగించినట్లు తెలిపారు. ఊహించనదానికంటే చంద్రయాన్-2 తొలిదశ ఎక్కు విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. అభినందనల వెల్లువ.. చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి.. భారత్ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఇస్రోశాస్త్ర వేత్తలను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్వీటర్ వేదికగా శాస్త్రవేత్తలను కొనియాడారు. ‘ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంతో దేశం మొత్తం గర్వించేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇస్రో ఇలానే మరిన్ని కొత్త విషయాల కోసం ప్రయోగాలు చేపడుతూ విజయవంతం కావాలి.’ అని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చరిత్రలోనే ఇదో అద్భుత ఘట్టమని, మన శాస్త్రవేత్తల శక్తిని,130 కోట్ల భారతీయుల అంకిత భావాన్ని చంద్రయాన్ ప్రయోగం ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కొనియాడిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను తెలంగాణ గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ‘చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు అభినందనలు. కోట్ల కలలను చంద్రునిపైకి తీసుకెళ్లడం చారిత్రాత్మక సందర్భం. మన శాస్త్రవేత్తలు, ఇస్రో భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019 చదవండి: జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్–2 -
‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ
సాక్షి, హైదరాబాద్ : భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది. 3.8 టన్నుల బరువున్న చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్-3ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.15వ తేదీ వేకువజామున ప్రయోగించాలనుకున్న చంద్రయాన్–2ను చివరి గంటలో రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు. -
చంద్రయాన్–2 ప్రయోగం రేపే
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. 15వ తేదీ వేకువజామున ప్రయోగించాలనుకున్న చంద్రయాన్–2ను చివరి గంటలో రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ప్రయోగం పనులపై అన్ని సెంటర్ల డైరెక్టర్లతో ఎంఆర్ఆర్ సమావేశాన్ని నిర్వహించారు. షార్ శాస్త్రవేత్తలు కల్పనా అతిథి గృహంలో ఈ సమావేశానికి హాజరై సలహాలు, సూచనలను తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఒకసారి లాంగ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ ఆధ్వర్యంలో మరోమారు సమావేశమయ్యాక సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే.. ఆదివారం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ షార్కు విచ్చేసిన తర్వాత ల్యాబ్ మీటింగ్ జరుగుతుందని షార్ అధికార వర్గాలు అంటున్నాయి. మొత్తానికి 3,850 కిలోల బరువు కలిగిన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. -
ఉపగ్రహాలకు ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: భారత్ ప్రయోగించే ఉపగ్రహాలను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా వాటికి ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థను జోడించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎఎస్‌సీ) డెరైక్టర్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. దీనివల్ల ఇంధన ట్యాంకుల సైజు తగ్గడం ద్వారా మరింత ఎక్కువ బరువున్న పరికరాలను మోసుకెళ్లడం వీలువుతుందని ఆయన చెప్పారు. జీఎస్ఎల్వీ మార్క్-3ని ఈ ఏడాది డిసెంబరులో ప్రయోగిస్తామని, క్రయోజెనిక్ ఇంజిన్ తాలూకూ పరీక్షలను దశలవారీగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. చంద్రుడిపై ఒక రోవర్ ల్యాండై అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించే లక్ష్యంతో చంద్రయాన్-2 సిద్దమవుతోందని చెప్పారు. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల సన్నాహకాల్లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను రక్షించేందుకు ఉద్దేశించిన అబార్ట్ మిషన్‌ను ఈ ఏడాది చివరిలో చేపడతామని వివరించారు. -
ఉపగ్రహాలకు ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థ
* ఎక్కువ బరువున్న పరికరాలు మోసుకెళ్లేలా ప్రయోగాలు * డిసెంబర్లో జీఎస్ఎల్వీ మార్క్-3, అబార్ట్ మిషన్ * విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెరైక్టర్ వెల్లడి * ప్రారంభమైన హై ఎనర్జీ మెటీరియల్స్ సదస్సు సాక్షి, హైదరాబాద్: భారత్ ప్రయోగించే ఉపగ్రహాలను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా వాటికి ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థను జోడించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎఎస్‌సీ) డెరైక్టర్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. దీనివల్ల ఇంధన ట్యాంకుల సైజు తగ్గుతుందని, దీంతో ఎక్కువ బరువున్న పరికరాలను మోసుకెళ్లడం వీలవుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం హై ఎనర్జీ మెటీరియల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు కె.శివన్ ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్ఎల్వీ మార్క్-3ని ఈ ఏడాది డిసెంబరులో ప్రయోగిస్తామని వివరించారు. చంద్రుడిపై రోవర్ ల్యాండ్ అయి పరీక్షలు నిర్వహించే లక్ష్యంతో చంద్రయాన్-2 సిద్ధమవుతోంద న్నారు. మానవసహిత ప్రయోగాల్లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను రక్షించేందుకు ఉద్దేశించిన అబార్ట్ మిషన్‌ను ఈ ఏడాది చివరలో చేపడతామన్నారు. పేలుడు పదార్థాలు గుర్తించేందుకు... పేలుడు పదార్థాలను గుర్తించేందుకు జాగిలాలు కొంత మేరకే ఉపయోగపడుతున్న నేపథ్యంలో పుణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ ఓ కిట్‌ను అభివృద్ధి చేసిందని సంస్థ డెరైక్టర్ డాక్టర్ కేపీఎస్ మూర్తి తెలిపారు. ఈ సాంకేతికతను అగ్రరాజ్యం అమెరికాకు కూడా అందించామని చెప్పారు. మందమైన బ్యాగులు, లోహపు పెట్టెల్లో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను కూడా సులువుగా గుర్తించేందుకు తాము ప్రత్యేకమైన పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఓ కేంద్రం ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఎల్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ (ఎఎస్ఎల్) డెరైక్టర్లు కె.జయరామన్, టెస్సీ థామస్‌తోపాటు సదస్సు నిర్వాహక కమిటీ కో చైర్మన్, అగ్ని-3 ప్రాజెక్ట్ డెరైక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీవో డెరైక్టర్ జనరల్ (మిస్సైల్స్) సతీశ్ కుమార్ హై ఎనర్జీ మెటీరియల్స్ కాన్ఫరెన్స్, ఎగ్జిబిట్స్ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. -
రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజన్‌ను రెండోసారి విజయవంతంగా పరీక్షించడం ద్వారా.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్‌ల తర్వాత.. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ సామర్థ్యం సాధించిన దేశంగా గత ఏడాదే నిలిచిన భారత్ తాజా ప్రయోగంతో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ విజయం వచ్చే ఏడాది ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ మార్క్ 3కి మరింత ఊతమివ్వనుంది. మార్క్ 3 రాకెట్‌తో నాలుగు టన్నుల కంటే ఎక్కువ బరువుండే ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం లభిస్తుంది. ఇస్రో 17 ఏళ్ల కృషి..: రెండు టన్నుల కన్నా అధిక బరువు గల భారీ ఉపగ్రహాలను నింగిలోకి పంపించటానికి క్రయోజనిక్ ఇంజన్లు కీలకమైనవి. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ల విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల దశాబ్దాల శ్రమ ఉంది. 1990 ప్రాంతంలో అమెరికా ఆంక్షల కారణంగా ఈ సంక్లిష్టమైన టెక్నాలజీ మనకు అందకుండా పోయింది. అగ్రరాజ్యం ఒత్తిళ్లకు తలొగ్గిన రష్యా తయారీ టెక్నాలజీ బదలాయింపునకు చేసుకున్న ఒప్పందాన్ని కూడా కాదని ఏడు ఇంజన్లను అందించి చేతులు దులుపుకుంది. అప్పటి నుంచే ఈ ఇంజన్లను సొంతంగా తయారుచేసుకోవాలని ఇస్రో శాస్త్రవేత్తలు సంకల్పించా రు. 1994లో మొదలైన ఈ ప్రాజెక్టు 2010 నాటికి తొలి పరీక్షకు సిద్ధమైంది. అప్పుడు జీఎస్ఎల్వీ డీ3లో ఉపయోగించిన తొలి దేశీ క్రయోజనిక్ ఇంజన్ అసలు మండలేదు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు ఇస్రో ఎంతో కృషి చేసింది. శాస్త్రవేత్తలు ఎంతో పట్టుదలతో 37 రకాల పరీక్షలు నిర్వహించి క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేశారు. నాలుగేళ్ల తర్వాత 2014 జనవరి 5న జీఎస్ఎల్వీ-డీ5 ద్వారా స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను ఇస్రో దిగ్విజయంగా వినియోగించింది. మళ్లీ ఇప్పుడు స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను వినియోగించి చేసిన ప్రయోగం కూడా సఫలమవటంతో.. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై భారత్ పూర్తిపట్టు సాధించినట్లేనని భావిస్తున్నారు. సంక్లిష్టమైన టెక్నాలజీ..: అంతరిక్ష ప్రయోగాలకు టన్నుల కొద్దీ ఇంధనం అవసరమవుతుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తిని పొందేందుకు క్రయోజనిక్ ఇంజన్లు మేలైనవి. కానీ ఈ టెక్నాలజీ చాలా సంక్లిష్టమైంది. రాకెట్ ఇంధనాలుగా వాడే హైడ్రోజన్ మైనస్ 253, ఆక్సిజన్ మైనస్ 183 డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవరూపంలోకి మారతాయి. ఇంతటి అత్యంత శీతలమైన స్థితిలో వీటిని నిల్వ చేయడం, ఇంజన్లలో వాడటం కత్తిమీద సామే. రాకెట్‌లోని ఇతర ఇంజన్ల నుంచి వెలువడే వేడి దీన్ని తాకకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అమెరికా 1969లోనే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని చంద్రుడిపైకి ప్రయోగించిన రాకెట్లో ఉపయోగించింది. ఇక భారీ ప్రయోగాలే లక్ష్యం వాణిజ్యపరంగా ముందంజ: ఇస్రో చైర్మన్ సూళ్లూరుపేట: క్రయోజనిక్ ఇంజన్ రెండోసారి విజయవంతం కావడం తో జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వాణిజ్య ప్రయోగాలు చేయడానికి మార్గం సుగమం అయిందని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. జీఎస్ఎల్ వీ డి6 ప్రయోగం తరువాత విలేకరులతో మాట్లాడుతూ అమెరికాఅంతరిక్ష సంస్థ ఆంట్రిక్స్ కార్పొరేషన్‌తో 20 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీఎస్ఎల్వీ సీ30 ద్వారా 4 నాసా ఉపగ్రహాలను పంపనున్నామన్నారు. క్రయోజనిక్ దశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్4 ద్వారా నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని పంపే స్థాయికి పెంచుతామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రోశాట్, డిసెంబర్లో సింగపూర్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలతో పాటు 2016 మార్చిలోఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో 3 ఉపగ్రహాలను ప్రయోగిస్తామన్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్05 ప్రయోగానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. -
మహాద్భుతం!
గగనవీధుల్లో విజయ పరంపరను కొనసాగిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం అత్యంత కీలకమైన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని సునాయాసంగా పూర్తిచేయగలిగింది. ప్రయోగ సమయం అనుకున్నకంటే అరగంట ఆలస్యమైందన్న మాటేగానీ మిగిలినవన్నీ ముందుగా నిర్దేశించిన ప్రకారం పూర్తయ్యాయి. మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈ ప్రయోగం అనేక విధాల ఎన్నదగినది. రానున్న కాలంలో మనం సైతం వ్యోమగాములను అంతరిక్షానికి పంపేందుకు ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో వాడిన కేర్ మాడ్యూల్ వ్యోమగాములను ఉద్దేశించిందే. భవిష్యత్తులో అచ్చంగా వ్యోమగాములను పంపినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోవడానికి దీన్ని రూపొందించారు. ఒక చిన్న బెడ్ రూమ్‌ను పోలివుండే ఈ మాడ్యూల్లో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంటుంది. అలాగే రాకెట్‌కు రెండు దశల్లో వాడిన బూస్టర్లు సైతం మన శాస్త్రవేత్తలకు ఎనలేని ఆత్మస్థైర్యాన్ని అందించగలిగాయి. మొదటి దశలో ఉపయోగించిన ఎస్-200 బూస్టర్లు, రెండో దశ లోని ఎల్-110 బూస్టర్లు శాస్త్రవేత్తలిచ్చిన కమాండ్లకు అనుగుణంగా సక్రమంగా పనిచేసి నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ దూసుకెళ్లడానికి తోడ్పడ్డాయి. ఇన్నాళ్లూ ఇస్రో చేసిన ప్రయోగాలకూ, ఈ ప్రయోగానికీ గుణాత్మకమైన మార్పు కూడా ఉన్నది. మన శాస్త్రవేత్తలు లోగడ ఏ ప్రయోగంలోనూ ఇంత బరువైన రాకెట్‌ను ఉపయోగించలేదు. ఇది ఏకంగా 6,30,000 కిలోలు! ఇందులో కేర్ మాడ్యూల్ బరువు 3,775 కిలోలు. ఇంత బరువైన మాడ్యూల్‌ను భూమికి 126 కిలోమీటర్ల ఎత్తులో ఆ రాకెట్ జారవిడ్చగా అది సురక్షితంగా భూమార్గం పట్టింది. మాడ్యూల్ వెనక్కి వస్తున్న క్రమాన్నంతటినీ పరిశీలించి తమ అంచనాలు ఎలా ఉన్నాయో...ఎక్కడెక్కడ సవరించుకోవడం అవసరమో నిర్ధారించుకోవడానికి ఈ ప్రయోగం శాస్త్రవేత్తలకు ఉపయోగపడింది. అలాగే రాకె ట్పైనా, మాడ్యూల్పైనా వాతావరణ ప్రభావం, దాని పీడనం ఎలా పనిచేశాయో...రాకెట్ సామర్థ్యం ఎలాంటిదో అధ్యయనం చేయడానికి కూడా తోడ్పడింది. మాడ్యూల్ వేగాన్ని కొంతదూరం వరకూ దానికున్న మోటార్ల ద్వారా నియంత్రించి అటు తర్వాత ఆ మాడ్యూల్‌కు అమర్చిన ప్యారాచూట్లు తెరుచుకునేలా చేసి అది నేరుగా బంగాళాఖాతంలో పోర్టుబ్లెయిర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో 20 నిమిషాల్లో పడేలా చేయడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియంతా అనుకున్నట్టే సాగడం...ప్యారాచూట్లు సైతం ఎలాంటి లోపమూ లేకుండా పనిచే సి సహకరించడం కీలకమైనది. ఇందువల్ల భవిష్యత్తులో వ్యోమగాములను అంతరిక్షానికి పంపి వారిని తిరిగి సురక్షితంగా తీసుకురాగలిగిన సామర్థ్యాన్ని మన శాస్త్రవేత్తలు సొంతం చేసుకున్నట్టయింది. ఇలాంటి సామర్థ్యం ఇంతవరకూ రష్యా, అమెరికా, చైనాలకు మాత్రమే ఉంది. ఈ ప్రయోగం మరో రకంగా కూడా ముఖ్యమైనది. రాకెట్‌లోని రెండు దశలూ సక్రమంగా పనిచేశాయని రుజువైంది. ఇక క్రయోజనిక్ ఇంజన్(సీ-25)ను వాడే మూడో దశను కూడా విజయవంతం చేయగలిగితే మనం వ్యోమగాములను పంపగలిగే సామర్థ్యాన్ని పూర్తిగా సంతరించుకున్నట్టవుతుంది. అంతేకాదు...భారీ ఉపగ్రహాల ప్రయోగానికి ఇకపై విదేశాలపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. అంతరిక్షం మన ఊహలకూ, అంచనాలకూ దాదాపు దగ్గరిగానే ఉన్నా అక్కడ హఠాత్తుగా అత్యంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే రాకెట్‌లోని వ్యవస్థలు అత్యంత సంక్లిష్టమైనవి. ఏ చిన్న లోపం ఏర్పడినా మొత్తం అంతా కుప్పకూలుతుంది. రాకెట్ ప్రయోగానికి భారీ మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. అది ముందే విడుదల కావడం లేదా హఠాత్తుగా అవసరమైనదానికంటే ఎక్కువ విడుదలకావడం వంటి ప్రమాదాలు ఎప్పుడూ పొంచివుంటాయి. అంతేకాదు...రాకెట్‌కు, మాడ్యూల్‌కు వాడే లోహాలైనా, మిశ్రమ లోహాలైనా రాకెట్ గమనంలో ఎదురయ్యే వాతావరణపరమైన ఒత్తిళ్లను ఎంత సమర్థవంతంగా తట్టుకుంటాయో ఖచ్చితంగా అంచనా వేసుకోగలగాలి. ఈ మొత్తం ప్రక్రియలో శాస్త్రవేత్తల కళ్లుగప్పి ఏ చిన్న లోపం సంభవించినా అది తీసుకొచ్చే నష్టం అపారమైనది. వ్యోమగాములను పంపే ప్రయోగమైతే ఇక చెప్పేదేముంది?! అంతరిక్ష వైజ్ఞానిక ప్రగతిలో మన శాస్త్రవేత్తల కృషి అనుపమానమైనదీ... అసమానమైనదీ! వైఫల్యాలు లేవని కాదు...కానీ, అటువంటి వైఫల్యాలను భవిష్యత్తు విజయాలకు సోపానాలుగా మలచుకోవడం ముఖ్యం. మన శాస్త్రవేత్తలు ఆ పనిని దిగ్విజయంగా పరిపూర్తి చేయగలిగారు. పీఎస్ఎల్వీ ప్రయోగాలన్నీ విజయం సాధించినా భారీ బరువుండే ఉపగ్రహాలను మోసుకుపోగల జీఎస్‌ఎల్‌వీల మాత్రం వారికి అంత సులభంగా పట్టుబడలేదు. అందుకు కారణం అందులో వాడే క్రయోజనిక్ ఇంజన్లే. అతి శీతల స్థితిలో సైతం పనిచేయగల ఆ ఇంజన్లను మనకు అందజేయడానికి 1992లో రష్యా ఒప్పందం కుదుర్చుకున్నా అనంతరకాలంలో జరిగిన అణు పరీక్షలు దానికి ఆటంకంగా నిలిచాయి. అమెరికా ఒత్తిడితో ఆ దేశం క్రయోజనిక్ ఇంజిన్లు ఇవ్వడం మానుకుంది. అయినా ఇస్రో శాస్త్రవేత్తలు దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్‌ను ఉపయోగించి తీరాలన్న సంకల్పంతో ఎంతో శ్రమపడ్డారు. ఈ ఏడాది జనవరిలో జీఎస్ఎల్వీ-డీ5ను విజయవంతంగా ప్రయోగించి ఆ సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు. ఇప్పుడు సంవత్సరం చివరిలో జీఎస్ఎల్వీ మార్క్-3 ఘనవిజయం కొసమెరుపు వంటిది. అందువల్లే ఇస్రో శాస్త్రవేత్తలకు దేశం మొత్తం నీరాజనాలు పడుతున్నది. ఈ విజయం మరిన్ని విజయాలకు స్ఫూర్తినిచ్చి అంతరిక్షంలోకి భారత్ సైతం వ్యోమగాములను పంపే రోజొకటి వస్తుందని ఆశించవచ్చు. -
'జీఎస్ఎల్వీ మార్క్ 3' విజయవంతం!
-
అంతరిక్షంలోకి మనమూ మనుషులను పంపొచ్చు!
జీఎస్ఎల్వీ మార్క్- 3 ప్రయోగం విజయవంతం కావడంతో.. ఇక మన దేశం సగర్వంగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి మొదటి అడుగు పడినట్లయింది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడం ఇప్పటివరకు కేవలం అగ్రరాజ్యాలకు మాత్రమే తెలిసిన విద్య. ఇక మీదట మనవాళ్లు కూడా సురక్షితంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగలరన్న విశ్వాసం కుదిరింది. రూ.155 కోట్ల ఖర్చుతో చేసిన ఈ ప్రయోగం.. తొలి అడుగులోనే ఘన విజయం సాధించింది. ఇస్రో ఇంతవరకు చేసిన అత్యంత బరువైన ప్రయోగం ఇదే. జీఎస్ఎల్వి మార్క్-3 ద్వారా క్రూ మాడ్యూలును నింగిలోకి పంపి, అక్కడి నుంచి మళ్లీ సురక్షితంగా నేల మీదకు తీసుకురాగలిగారు మన ఇస్రో శాస్త్రవేత్తలు. రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను అమర్చారు. భూమి నుంచి 126 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేసింది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకుంది. అండమాన్‌కు సమీపంలోని సముద్రం వద్ద దీన్ని ఇస్రో బృందం సేకరించింది. అండమాన్‌లోని ఇందిరా పాయింటుకు 180 కిలోమీటర్ల దూరంలో ఈ మాడ్యూల్ సముద్రంలో పడింది. మూడు టన్నులు, 3.1 మీటర్ల వ్యాసం ఉన్న ఈ మాడ్యూలు.. 31 మీటర్ల వ్యాసం ఉన్న పారాచూట్ సాయంతో కిందకి దిగింది. సెకనుకు 7 కిలోమీటర్ల వేగంతో మాడ్యూల్ కిందకు వచ్చింది. ఈ మాడ్యూలును ఆగ్రాలోని డీఆర్డీఓలో తయారుచేశారు. ఇద్దరి నుంచి ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేలా దీన్ని రూపొందించారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్ -3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు జగన్ అభినందలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రోజు ఉదయం 9.30 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను నింగిలోకి విజయవంతగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను ఇస్త్రో శాస్త్రవేత్తలు అమర్చి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 630. 58 టన్నులు బరువు ఉన్న ఈ రాకెట్ ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యింది. 3,735 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.విష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్ వీ మార్క్-3 ని ప్రయోగించింది. -
లక్ష్యాన్ని చేధించిన జీఎస్ఎల్వీ మార్క్- 3
-
జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్
-
అంతరిక్ష పరిశోధనలో మరో కలికితురాయి
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జీఎస్ఎల్వీ మార్క్- 3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సరిగ్గా తొమ్మిదన్నర గంటల ప్రాంతంలో శ్రీహరికోటలోని షార్ నుంచి.... జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసింది. కోట్లాది మంది ప్రజల ఆశలు మోసుకెళ్లిన రాకెట్....అంచెలంచెలు దాటుకుంటూ గమ్యస్తానాన్ని చేరింది. 20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేధించింది. వ్యోమగాముల గదిని రాకెట్ 126 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. టార్గెట్‌ను చేరేవరకూ....శాస్త్రవేత్తలతో పాటు కోట్లాది మంది ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. జీఎస్ఎల్వీ రాకెట్ ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్దేశింత స్థానాన్ని చేరడంతో .....షార్‌లో హర్షాతీరేకాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని అభినందనలు తెలుపుకున్నారు. అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపించడమే లక్ష్యంగా ఇస్రో చేసిన ప్రయోగం ఇది. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపిన వ్యోమగాముల్ని తిరిగి సురక్షితంగా భూమికి చేర్చే ప్రక్రియపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఇస్రో ప్రయోగించిన అతిబరువైన ఎక్స్పర్మెంట్ ఇదే. ప్రయోగ సక్సెస్‌తో శాస్త్రవేత్తలు మరో ఐదేళ్లలో అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు సిద్ధమవుతున్నారు. మానవులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో మరో ముందడుగు వేసిందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇది గుర్తుంచుకోవాల్సిన రోజు అని ఆయన పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ అందరి కృషితోనే ప్రయోగం విజయవంతమైందన్నారు. క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలోకి చేరుకుందని రాధాకృష్ణన్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి రూ.155 కోట్లు వ్యయం అయినట్లు ఆయన తెలిపారు. -
'అంతరిక్ష ప్రయోగాల్లో గుర్తుంచుకోవాల్సిన రోజు'
-
ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. 'జీఎస్ఎల్వీ మార్క్ -3 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయినందుకు సంతోషం. ఈ విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు'అంటూ మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురువారం ఉదయం 9.30 గంటలకు నింగిలోకి వెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను ఇస్త్రో శాస్త్రవేత్తలు అమర్చి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 630. 58 టన్నులు బరువు ఉన్న ఈ రాకెట్ ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యింది. 3,735 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.విష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్ వీ మార్క్-3 ని ప్రయోగించింది. -
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్-3
-
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్-3
నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం ఉదయం 9.30 గంటలకు నింగిలోకి వెళ్లిన ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను అమర్చినట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం జీఎస్ఎల్వీ-3 రాకెట్ బరువు 630. 58 టన్నులు. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యిందని స్పష్టం చేశారు. 3,735 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. భూమి నుంచి 126.15 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేస్తుంది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకోనుంది. అండమాన్ కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్ వీ మార్క్-3 ని ప్రయోగించింది. -
జీఎస్ఎల్వీ మార్క్-3కి కౌంట్‌డౌన్ ప్రారంభం
-
జీఎస్ఎల్వీ మార్క్-3కి కౌంట్‌డౌన్ ప్రారంభం
నెల్లూరు :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. అత్యంత బరువైన ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన ఈ రాకెట్ కోసం బుధవారం ఉదయం 8 గంటల 30 నిముషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 9 గంటలకు ఈ రాకెట్ నింగలోకి దూసుకెళ్లనుంది. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ను అమర్చినట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి నుంచి 136 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేస్తుంది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకోనుంది. అండమాన్ కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే .. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంతో పాటు మానవ సహిత ప్రయోగాలకు కూడా సిద్ధమయ్యేందుకు వీలవుతుంది.