హైదరాబాద్: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్ -3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు జగన్ అభినందలు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రోజు ఉదయం 9.30 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను నింగిలోకి విజయవంతగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను ఇస్త్రో శాస్త్రవేత్తలు అమర్చి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
630. 58 టన్నులు బరువు ఉన్న ఈ రాకెట్ ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యింది. 3,735 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.విష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్ వీ మార్క్-3 ని ప్రయోగించింది.
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
Published Thu, Dec 18 2014 1:37 PM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement