జగనన్న జైలులో ఉన్నా జననేత అని నిరూపించుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె అనంతపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి సర్కిల్ భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సప్తగిరి సర్కిల్ జనంతో నిండిపోయింది. ఎటు చూసినా జనమే జనం. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కాంగ్రెస్ నేతలకు న్యాయం చేసే సత్తా లేదని తేలిపోయిందన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబే అన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కయ్యారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకుంటారనుకుంటే, ఆయన ఆ ఆలోచనే చేయడం లేదన్నారు. చంద్రబాబుకు అసలు అత్మ అంటూ ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై కుట్రలు పన్నిందే చంద్రబాలు అని ఆరోపించారు. ఓట్లు - సీట్ల కోసం కోట్ల మందికి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్నారు. తరతరాలకు కాంగ్రెస్, టీడీపీలు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమం చేస్తున్నవారిపై ఈ ప్రభుత్వం అబద్ధపు కేసులు పెడుతోందన్నారు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం కడుపుకొడుతోందని విమర్శించారు. సీమాంద్ర ఉద్యమం చేస్తున్నవారికి వైఎస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
Published Wed, Sep 4 2013 9:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement