సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆ రాష్ట్ర గవర్నర్ సదాశివం ఆస్పత్రికి జయలలితను పరామర్శించేందుకు వచ్చారు. 'వైద్య చికిత్సలకు జయలలిత స్పందిస్తున్నారని మాకు వైద్యులంతా తెలిపారు. ఆమె త్వరలోనే డిశ్చార్జి అవుతుంది కూడా. అంతేకాదు.. అతి త్వరలోనే ఆమె పాలనా పగ్గాలు కూడా చేపడుతుంది' అని గవర్నర్ సదాశివం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని మొత్తం కేరళ ప్రజలంతా కోరుకుంటున్నారని, తాము ఆశించినట్లే ఆస్పత్రికి వచ్చి వైద్యుల నుంచి శుభవార్త విన్నందుకు చాలా సంతోషంగా ఉందని, వైద్యులు చాలా ఆత్మవిశ్వాసంతో ఆమె త్వరలోనే కోలుకుంటుందని చెప్పారని వివరించారు.