ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను మార్చి, ఆయన స్థానంలో కేరళ గవర్నర్ జస్టిస్ సదాశివాన్ని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం అమలు, ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలంటే.. గవర్నర్ మార్పు ఒకటే మార్గమని కేంద్రం భావిస్తోంది. గతంలో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కూడా జస్టిస్ సదాశివం పని చేసి ఉండటంతో ఆ అనుభవం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.
Published Mon, Sep 7 2015 7:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement