తెలంగాణ ఆడబిడ్డలకు మేనమామలా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ పేద యువతులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.75వేలు అందించి, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారన్నారు. అలాగే ఆడపడచులందరికీ కేసీఆర్ అన్నగా భరోసా ఇస్తున్నారని, ఆయన మనసున్న మారాజుగా అభివర్ణించారు.