కేపీసీ గాంధీ నియామక రహస్యమేంటో? | kpc-gandhi-appointed-as-advisor-to-andhra-pradesh-government | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 19 2015 11:50 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు కేపీసీ గాంధీ (కాజా పూర్ణచంద్ర గాంధీ)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించటం చాలా సాధారణంగా కనిపిస్తున్న విషయం అయినా ... ఓటుకు కోట్లు కేసు విచారణ సమయంలో కేపీసీ గాంధీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. కేపీసీ గాంధీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ డైరెక్టర్గా దీర్ఘకాలం పని చేశారు. ఓటుకు నోటు కేసులో ...ఆడియో, వీడియో టేపుల నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్ ....త్వరలో ఏసీబీ కోర్టుకు సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేపీసీ గాంధీని హడావిడిగా ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవటం అనుమానాలకు తావీస్తుంది. ఓటుకు కోట్లు కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నచంద్రబాబు నాయుడు దీని నుంచి బయటపడేందుకు తనకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నట్లు దీనిబట్టి అర్థం అవుతోంది. ఫోరెనిక్స్ విభాగంలో నిపుణుడయిన కేపీసీ గాంధీని నియమించుకోవటం చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా చెప్పుకోవాలేమో. గాంధీ తన పదవీ విరమణ తర్వాత ..ట్రూత్ ల్యాబ్స్ పేరుతో దేశంలోనే తొలి ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడికి కేబినెట్ హోదా లభిస్తుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement