బాలికపై అత్యాచారం కేసులో కర్నూలు మొదటి అదనపు జిల్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించాలని జడ్జి ఎస్.ప్రేమావతి తీర్పు చెప్పారు. 2014లో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ తరహా కేసుల్లో ఇలాంటి తీర్పు ఇదే మొదటి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కర్నూలు వన్‌టౌన్ పరిధిలో ఖడక్‌పురా వీధికి చెందిన పఠాన్ ఖాజాఖాన్(28) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది జూలై 18న సాయంత్రం సమయంలో అదే వీధికి చెందిన పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు.