Kurnool court
-
'కర్నూలు' నిర్భయ కేసులో కోర్టు సంచలన తీర్పు
-
'కర్నూలు' నిర్భయ కేసులో కోర్టు సంచలన తీర్పు
⇒ నిందితుడికి మరణించే వరకు కఠిన కారాగార శిక్ష కర్నూలు: బాలికపై అత్యాచారం కేసులో కర్నూలు మొదటి అదనపు జిల్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించాలని జడ్జి ఎస్.ప్రేమావతి తీర్పు చెప్పారు. 2014లో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ తరహా కేసుల్లో ఇలాంటి తీర్పు ఇదే మొదటి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కర్నూలు వన్‌టౌన్ పరిధిలో ఖడక్‌పురా వీధికి చెందిన పఠాన్ ఖాజాఖాన్(28) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది జూలై 18న సాయంత్రం సమయంలో అదే వీధికి చెందిన పిల్లలు వీధిలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో ఖాజాఖాన్ చాక్లెట్స్ చూపించి ఓ చిన్నారి(7)ని మిద్దెపైకి తీసుకెళ్లాడు. కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది. ఉదయం 8 గంటల సమయంలో.. చిన్నారి స్నేహితులు షబానా బేగం, మరో అబ్బాయి ‘ఆటో అంకుల్ చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్లినట్లు’ చెప్పారు. ఆ వెంటనే ఖాజాఖాన్ ఇంటికి వెళ్లి చూడగా బాలిక ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా.. చాక్లెట్ ఇస్తానని అంకుల్ ఇంట్లోకి తీసుకెళ్లాడని, జరిగిన విషయాన్ని చెప్పింది. బాలిక తల్లిదండ్రులు స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితునిపై కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో కర్నూలు డీఎస్పీ డి.వి.రమణమూర్తి 18 మంది సాక్షులను విచారించి చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా నేరం రుజువు కావడంతో నిందితునికి జీవితమంతా కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎస్.ప్రేమావతి తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.రాజేంద్ర ప్రసాద్ ఈ కేసు వాదించారు. -
రేప్ కేసులో బతికున్నంత కాలం జైలుశిక్ష
కర్నూలు లీగల్: నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులకు కర్నూలు జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. వారు బతికున్నంత కాలం జైలులో మగ్గాల్సిందేనని న్యాయమూర్తి పి.వి.జ్యోతిర్మయి ఆదేశిస్తూ అరుదైన తీర్పును బుధవారం వెలువరించారు. నిందితులకు యావజ్జీవంతో పాటు రూ.5.30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. వివరాలివీ.. 2013 జూలైలో కర్నూలు నగరంలోని ఓ కళాశాలలో నర్సింగ్ చదివే విద్యార్థిని(20) తన సొంతూరు కోలార్(కర్ణాటక) వెళ్లేందుకు రాత్రి 9.30 గంటలకు ఆటో ఎక్కింది. ఆ ఆటో డ్రై వర్ మాదిగ రవికుమార్ అలియాస్ మట్టిగాడు, అతని మిత్రుడు కురువ శ్రీనివాసులు ఆమెను డోన్ వైపు తీసుకెళ్లారు. దౌర్జన్యంగా ఆమె వద్దనున్న బంగారు గొలుసును లాక్కుని, ఇనుపరాడ్డుతో గాయపరిచి అత్యాచారం చేసి పారిపోయారు. దాదాపు 20 రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాధితురాలు ఉల్లిందకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే వేరే కేసుల్లో పట్టుబడిన నిందితులను యువతి గుర్తించగా అత్యాచారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. కేసు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో వారిపై 366, 376(2)ఎం, 376(బి), 394 సెక్షన్ల కింద పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో వారికి జీవితకాల(బతికినంత కాలం) కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రేపిస్టులకు న్యాయవాదుల సహాయ నిరాకరణ అనేక మందిపై అత్యాచారాలకు పాల్పడిన నిందితుల తరఫున బెయిల్ దాఖలు చేయబోమని, వారి తరఫున వకల్తా పుచ్చుకోబోమని 2013లో కర్నూలు బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఆ తీర్మానం మేరకు న్యాయవాదులు ఎవరూ వారికి న్యాయ సహాయం అందించకపోగా న్యాయస్థానం వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఓ న్యాయవాదిని నియమించింది. -
కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి
-
‘ఉపాధి’ స్కాంలో సీఐడీ చార్జిషీటు
- రూ.124.9 కోట్ల గోల్మాల్ వ్యవహారం - 53మంది నిందితులపై కేసు - అవకతవకలు రూ.756.9 కోట్లని అంచనా సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమల్లో భాగం గా రాష్ట్రంలో చోటుచేసుకున్న అక్రమాలపై సీఐడీ శనివారం కర్నూలు కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. రూ.124.9 కోట్ల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ప్రభుత్వాధికారుల సహా 53మందిని నింది తులుగా పేర్కొంది. అయితే రూ. 756.9కోట్ల అవకతవకలు జరిగాయని తమ దర్యాప్తులో గుర్తిం చినట్లు సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ వెల్లడించారు. తొలుత కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామం పరిధిలో బినామీ పేర్లతో రూ. 44.31 లక్షలు పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఎమ్మిగనూరు పోలీసుస్టేషన్లో గత ఏడాది నవంబర్ 29న కేసు నమోదైంది. తర్వాత ఈ కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. ఈ ఒక్క గ్రామంలోనే 215 మంది అనర్హులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ఎవరెవరివో బినామీ పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చి భారీగా నిధులు దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సీఐడీ అధికారులు ఈ పథకంలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దర్యాప్తులో 2,15,623 మంది ఉపాధి హామీ పథకంలో అనర్హులుగా ఉన్నట్లు తేలింది. ఆయా కార్డుదారుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. వారికి చెల్లింపుల పేరుతో రూ. 124.9కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది. తర్వాత సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ స్కాంలో గోల్మాల్ అయిన మొత్తం రూ. 756.9 కోట్లు ఉండవచ్చని సీఐడీ లెక్కతేల్చింది. ఈ కేసులో మొత్తం 53మందిని అరెస్టు చేసింది. వారందరిపై దర్యాప్తు పూర్తి చేసి కర్నూలు జిల్లా కోర్టులో చార్జిషీటు దాఖలు చేసినట్లు అదనపు డీజీ కృష్ణప్రసాద్ తెలిపారు.