వ్యవసాయం కోసం చేసిన అప్పులు లక్షల్లో కుప్పలయ్యారుు.. ఉన్న పొలాన్ని అమ్మి అప్పులు తీర్చాలనుకుంటే పెద్ద నోట్ల సమస్య వచ్చిపడింది. చేతిలో డబ్బుల్లేవు.. భూమిని కొనేం దుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి.. ఈ ఆవే దనతో చావే శరణ్యమనుకున్నాడు.. తాను మరణిస్తే కుటుంబ సభ్యులకు సమస్యలు తప్పవని భావిం చాడు.. ఆహారంలో విషం కలిపి అందరికీ పెట్టాడు.. మంగళవారం రాత్రి సిద్ధిపేట జిల్లా ధర్మారంలో జరిగిన ఈ ఘటనలో బాలయ్య (42) అనే రైతు, ఆయన తండ్రి గాలయ్య (72) మరణించగా.. బాలయ్య భార్య బాలలక్ష్మి, కుమారుడు ప్రశాంత్ మృత్యువుతో పోరాడుతున్నారు. ఆ ఆహారం తినని బాలయ్య తల్లి వజ్రమ్మ, కుమార్తె అఖిల బతికి బయటపడ్డారు.
Published Thu, Nov 17 2016 7:34 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
Advertisement