ఫొటో ఎందుకు తీసేశారో మరి! | Lokesh open letter to Jagan | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 9 2016 6:38 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తుంది? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ ప్రశ్నిస్తుంటే ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సమాధానం చెప్తున్నట్టుగా లేదూ! కావాలంటే కాస్త జాగ్రత్తగా వారి ముఖకవళికలను గమనించండి.. అక్కడేం జరిగి ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఫేస్‌బుక్‌లో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో ఈ ఫొటోను చూసిన కొందరు నెటిజన్లు తాము అర్థం చేసుకున్న విషయాన్నే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చిన రాజప్పను లోకేశ్ నిలదీస్తున్నట్లు భావించిన నెటిజన్లు దానిపై విస్తృతమైన చర్చ జరిపారు. పలు న్యూస్ సైట్లలోనూ లోకేశ్ తీరుపై ఫొటోతో సహా పలు కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని ‘సాక్షి’ ప్రచురించింది. సాక్షి కథనంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement