డివైడర్‌ను ఢీకొన్న లారీ దగ్ధం | Lorry Burns After Hits Divider at Tufran Tollgate || Medak | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 3 2016 1:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

మెదక్‌ జిల్లాలోని తుప్రాన్‌ టోల్గేట్‌ వద్ద ఆదివారం ఉదయం ఓ లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. అతివేగంగా బిస్కెట్‌ లోడ్‌తో వస్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. షాట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి లారీ దగ్ధమైనట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement