'టీ'లో బిస్కెట్స్ ముంచుకుని తింటున్నారా..?
మనం కొన్ని రకాల ఆహార పదార్థాలని పలు కాంబినేషన్స్‌లో తింటుంటాం. అయితే ఇలా తినడం అన్ని రకాల ఆహార పదార్థాలకు మంచిది కాదు. ఒక్కోసారి ఇలా తినడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కూడా. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. చాలామందికి విరామ సమయంలో 'టీ' తాగే అలవాటు ఉంటుంది. దీంతోపాటు బిస్కెట్లు తీసుకుంటుంటారు. ఇలా 'టీ'లో బిస్కెట్లు ఇముంచుకుని తినడం అలవాటు లేదా ఇష్టంగా ఉంటుంది కొందరికి. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో స్నాక్స్‌గా ఇలా తింటుంటారు కూడా. అయితే ఇది అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు ఎందుకంటే..మనం ఇలా చాయ్‌లో బిస్కెట్లు ముంచుకుని తినడం వల్ల అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అందులోనూ ఈ బిస్కెట్లు ప్యాక్ చేయబడి ఉంటాయి. వీటిని శుద్ధి చేసిన మైదాపిండి, చక్కెరలతో తయారు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా తింటామో రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఫలితంగా శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత తదితర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు.అంతేగాదు ఇది గట్ మైక్రోబయోమ్‌కు అంతరాయం కలిగిస్తుంది. పైగా మనం ఇలా తెలయకుండానే అధిక మొత్తంలో మైదా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది కాస్తా అధిక బరువుకి, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అలాగే అనేక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో పామ్ ఆయిల్ ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ బిస్కెట్లు కూడా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాల్లోకే వస్తాయి. ఇందులో ఉపయోగించే పామాయిల్ గుండె సంబంధిత సమ్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. దీనికి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ హెర్బల్ టీలను వినయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అవేంటంటే..హార్మోన్ బ్యాలెన్స్ 'టీ'లు..కొత్తిమీర సీడ్స్‌తో చేసే 'టీ' అదేనండి ధనియాలతో చేసే టీ. ఇది హైపోధైరాయిడజంతో సమర్థవంతంగా పోరాడుతుంది. మేతి సీడ్స్ 'టీ' మధుమేహం ఉన్నవారికి మంచిది. ఫెన్నెల్ అజ్వెన్ 'టీ' జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కరివేపాకు 'టీ' జుట్టు పెరుగుదలకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ హెర్బల్ 'టీ'లు హార్మోన్ల సముతుల్యత తోపాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అలాంటి పెర్ఫ్యూమ్స్ కొంటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్!)