ఎమ్మెల్యేకు హైకోర్టు చీవాట్లు.. లక్ష ఫైన్‌ | Madras High Court fines MLA Vetrivel Rs 1 lakh for wasting court's time | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 11 2017 4:29 PM | Last Updated on Wed, Mar 20 2024 3:44 PM

అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ సమావేశానికి మద్రాస్‌ హైకోర్టు పచ్చజెండా ఊపింది. జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం జరగకుండా స్టే విధించాలని కోరుతూ దినకరన్‌ వర్గ ఎమ్మెల్యే పి. వెట్రివేల్‌ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమను కాకుండా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. సమావేశానికి వెళ్లడం ఇష్టంలేకపోతే ఇంట్లో కూర్చోవాలని చురక అంటించింది. అంతేకాదు కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని ఎమ్మెల్యే వెట్రివేల్‌ను హైకోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement