కాపు జాతిపై కక్ష కట్టి రాక్షస పాలన సాగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. ‘మీరు, మీ యువరాజా మాత్రం 2050 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలా?’ అని ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.