భారం మోపడంలో ఎలాంటి వివాదాల్లేవ్.. | mv-mysura-reddy-fires-two-state-government | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 3 2015 3:24 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ప్రజలపై భారం మోపడంలో తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవేశ పన్ను వేసి ప్రజల నుంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే ఏపీ సర్కారుకు ఎంత దురుద్దేశం ఉందో స్పష్టంగా తెలుస్తోందని మైసూరా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ పై ఇచ్చిన జీవోను ఏపీ ప్రభుత్వం ఎందుకు కోర్టులో సవాల్ చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. ఇంటికి పెద్దన్నలా ఉండే కేంద్రం కూడా దీనిపై జోక్యం చేసుకోకపోవటం దారుణమన్నారు. రాష్ట్ర గవర్నర్ కూడా ఈ ఎంట్రీ పన్ను విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. గవర్నర్కు ఆలయాలు తిరగడానికే సమయం సరి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వల్ల ప్రజలు అల్లాడుతున్నారు. ఎన్నో విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. కానీ ప్రజలపై భారం మోపడంలో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వాలు పని చేస్తున్నాయని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement