అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ తన వాటా కోసం కేవలం అవినీతి మీదనే దృష్టి సారించారు.. పనులు ఎలా పూర్తి చేయాలి అనే ఆలోచన లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా ప్రయోజన వాజ్యాలు వేస్తే కేసీఆర్‌కు ఎందుకు చెమటలు పడుతున్నాయని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డు కోవడంలేదు.. అర్హత లేని వారికి పనుల కాంట్రాక్టులు ఇచ్చినందుకే కోర్టుకు వెళ్తున్నామని చెప్పారు. అవినీతి మీద పోరాటం కొత్త కాదన్నారు. ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే ప్రతిపక్షాలను కలుపుకున్నారని ఎద్దేవా చేశారు.