తాత్కాలిక ప్రాతిపదికన తనకు నైపుణ్యమున్న రంగంలో పనిచేయడానికి అర్హతలున్న విదేశీయుడు అమెరికాలో ప్రవేశించడానికి ఉపకరించే సాధనమే హెచ్1బీ వీసా. నిపుణుల కొరత ఉంటే, ఆ లోటు భర్తీకి ఇతర దేశాల నుంచి కార్మికులను కంపెనీలు ఈ వీసాల ద్వారా రప్పించడం 1990లో ఆరంభమైంది.