మెదక్ నిమ్జ్ భూసేకరణకు హైకోర్టు అనుమతి | NIMZ lands GO 123 : Relief for Telangana Government in High Court | Sakshi
Sakshi News home page

Aug 16 2016 1:53 PM | Updated on Mar 21 2024 8:47 PM

123 జీవోపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా నిమ్జ్ కోసం భూసేకరణ చేపట్టవచ్చని న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో జీవో 123 లోపాలను సవరిస్తూ 190 జీవోను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు 190 అనుబంధ జీవో కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. పరిశ్రమలు వచ్చేంతవరకూ బలవంతంగా రైతులను, నిర్వాసితులను ఖాళీ చేయించవద్దని హైకోర్టు... ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement