గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్లో మార్పు ఉండదు | No Changes to GHMC Elections Schedule | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 7 2016 6:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియకు ప్రభుత్వం మరోమారు చట్ట సవరణ చేసింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 33 (ఏ-డీ)కి సవరణల ద్వారా ఎన్నికల షెడ్యూల్ కాలాన్ని 26 రోజుల నుంచి 15 రోజులకు తగ్గిస్తూ ఈ నెల 4న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాధారణ సెలవు దినాల్లో సైతం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియల కోసం ఎన్నికల యంత్రాంగం పనిచేసేలా ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement