హైదరాబాద్ యూటీకి ఒప్పుకోం: నారాయణ | Not ready accept hyderabad as union territory says cpi Narayana | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 12 2013 11:32 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనకు తాము ఒప్పుకునేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఏ చిన్న గోడ కట్టాలన్నా కేంద్రం అనుమతి కావాలని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. భద్రాచలం తెలంగాణలో భాగంగానే ఉండాలని నారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల భయాందోళనలు తొలగించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. విభజన చేస్తున్నవారే అనంతర సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. కాగా రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందంతో సీపీఐ నేతలు ఈరోజు మధ్యాహ్యం భేటీ కానున్నారు. ఆపార్టీ ప్రతినిధులుగా నారాయణ, జెల్లీ విల్సన్ తమ అభిప్రాయాలను తెలుపనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement