పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుడి కష్టాలను తగ్గించేందుకు కేంద్రం మరిన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. ప్రజలకు పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల వినియోగాన్ని మరో 10 రోజుల పాటు పొడిగించింది. పాత పెద్ద నోట్లు ఈ నెల 24 వరకు చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, బస్సు టికెట్లు, ఎయిుర్ పోర్టుల్లోని కౌంటర్లలో విమాన టికెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీల్లో మందుల కొనుగోలు, ఎల్పీజీ సిలిండర్లు, రైల్వే కేటరింగ్‌ల్లో నవంబర్ 24 అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుబాటవుతాయి.