అటవీ ప్రాంతం నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన కొండ చిలువ కలకలం సష్టించింది. అటవీ శాఖ అధికారులకు ముప్పు తిప్పలు పెట్టింది. ఈ సంఘటన పట్టణ శివారులోని ఆరుంధతినగర్ వద్ద ఉన్న మద్దిలేరు ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. నల్లమల అడవిలో భారీ వర్షాలు పడి మద్దిలేరుకు భారీగా నీటి ప్రవాహం కొట్టుకొచ్చింది. కొండ చిలువ ఇళ్ల మధ్యకు వచ్చింది. దీంతో కలవరపడిన స్థానికులు దానిని పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అటవీ శాఖ అధికారులు వచ్చే సరికి కొండ చిలువ తప్పించుకుంది. అటవీ శాఖ అధికారులు వాహనం టైర్ల మధ్య నుంచి దూరి ఇంజన్‌లోకి జొరబడింది. దీంతో అటవీ అధికారులు గంటన్నర సేపు శ్రమించి కొండ చిలువను పట్టుకున్నారు. తర్వాత దానిని గిద్దలూరు రహదారిలోని నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.