ప్రధాని హోదాలో తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీకి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు