వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట ఎంపీ అవినాశ్ రెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోరుమామిళ్ల ఎంపీటీసీ గౌస్‌పీర్ కుమారుడి ఆచూకిని కనుగొనాలని ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. మంగళవారం అర్థరాత్రి తరువాత బలవంతంగా దీక్ష భగ్నం చేసి.. పోలీస్ వాహనంలో అవినాశ్‌రెడ్డిని తరలించారు.